పంచాదారతో ఇలా ఫేస్‌ స్క్రబ్‌ వేస్తే.. పంచదార బొమ్మలెక్క అవడం ఖాయం..!

-

పంచదార ఆరోగ్యానికి అంత మంచిది కాదు.. కానీ అదే పంచదార ముఖానికి బాగా ఉపయోగపడుతుంది. పంచదార ఇప్పుడు చెప్పుకోబోయే ఫేస్‌ స్క్రబ్‌ వేసుకుంటే..చాలా బాగుంటుంది. స్క్రబ్బింగ్ చేయడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి. దీంతో చర్మం మృదువుగా ,ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది అకాల వృద్ధాప్య సంకేతాలను దూరంగా ఉంచుతుంది. ఇంకెందుకు లేట్‌ అవి ఎలా చేయాలో చూద్దామా..!

ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల పంచదార తీసుకుని అందులో ఒక టీస్పూన్ నిమ్మరసం కలపాలి. దానికి ఒక చెంచా తేనె కలపండి. ఆర్గానిక్‌ తేనె అయితే మరీ మంచిది. తయారు చేసిన మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి, ఆపై సర్క్యూలర్ మోషన్లో స్క్రబ్ చేయండి. తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి.

ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల పంచదార తీసుకుని అందులో ఒక టీస్పూన్ నిమ్మరసం కలపండి. దానికి ఒక చెంచా తేనె కలపండి. సేంద్రీయ తేనెను ప్రయత్నించండి. ఈ మూడింటిని బాగా కలపి.. ముఖంపై అప్లై చేసి, ఆపై సర్క్యూలర్ మోషన్లో స్క్రబ్ చేయండి. తర్వాత నీళ్లతో ముఖాన్ని క్లీన్‌ చేయండి.

మీది ఆయిలీ స్కిన్ అయితే.. ఓట్ మీల్ స్క్రబ్ చేయండి. ఒక గిన్నెలో రెండు మూడు చెంచాల ఓట్స్ వేసి అందులో రెండు చెంచాల పంచదార కలపాలి. ఇందులో ఒక చెంచా తేనె ,ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 5 నిమిషాల పాటు స్క్రబ్ చేయండి. తడి రుమాలుతో ముఖాన్ని తుడవండి. సూపర్‌ రిజల్ట్‌ ఉంటుంది.

గ్రీన్ టీ ఆకులను తీసుకుని అందులో పంచదార కలపండి. దానికి ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ జోడించడం ద్వారా పేస్ట్‌ లా అవుతుంది. దీన్ని ముఖానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి. గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి.

పసుపు, చక్కెర పంచదారను మిక్సీలో వేసి లేత ముతక పొడిలా చేసుకోవాలి. ఈ పొడిలో రెండు చిటికెల పసుపు వేయాలి. దానికి రోజ్ వాటర్ కలపండి. ముఖాన్ని స్క్రబ్ చేసి, ఆపై ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

టమోటా రసం తీయండి లేదా తురుము వేయండి. దానికి చక్కెర, నిమ్మరసం కలపండి. ఒక చెంచా తాజా పెరుగు కూడా కలపండి. ఇప్పుడు దానితో స్క్రబ్ చేసి, తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి

పొడి చర్మం ఉన్నవారికి ఈ స్క్రబ్ మేలు చేస్తుంది. ఒక గిన్నెలో మూడు చెంచాల చక్కెర వేయండి. అందులో రెండు చెంచాల బాదం నూనె వేసి కలపాలి. మిక్స్‌తో ముఖానికి మసాజ్ చేస్తూ స్క్రబ్బింగ్ చేయండి. 5 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news