IND VS AUS : తొక్కిసలాట బాధితులకు 20 లక్షల ఎక్స్ గ్రేషియా !

-

HCA అధ్యక్షుడు అజారుద్దీన్ పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు యుగంధర్ గౌడ్. టికెట్ల విషయం లో నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడ్డారని పిర్యాదు చేశారు. వెంటనే అజారుద్దీన్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి.. పదవి నుండి తొలగించాలని.. హెచ్చార్సీని ఆశ్రయించారు యుగంధర్ గౌడ్.

క్రీడాభిమానులపై లాఠీఛార్జికి కారకుడైన అజారుద్దీన్ తో పాటు HCA నిర్వాకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని.. జింఖాన గ్రౌండ్స్ వద్ద తొక్కిసలాటకు ప్రధాన కారణం HCA తో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యంమే కారణమని పేర్కొన్నారు యుగంధర్ గౌడ్.

ఉప్పల్ లో జరగబోయే ఇండియా ఆస్ట్రేలియా టి 20 మ్యాచ్ కు ఏర్పాట్ల విషయంలో HCA పూర్తి వైఫల్యం చెందిందని.. క్రీడాభిమానుల నుండి లక్షల, కోట్ల రూపాయలు దండుకొని.. టికెట్ల విషయంలో సరైన ఏర్పాట్లు చేయని HCA… HCA ఇతర రాజాకీయ నాయకులు క్షతగాత్రులను పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు 20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news