“ఊర్వశివో రాక్షసివో” అంటూ వచ్చేసిన అల్లు హీరో

-

అల్లు శిరీష్ కు టాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకునేందుకు ఎంతో కష్టపడుతున్నాడు. మెగా మేనల్లుడిగా అల్లు వారి అబ్బాయి గా టాలీవుడ్ హీరో గా ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. మెగా బ్యాక్ గ్రౌండ్… మరోవైపు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తమ్ముడిగా ఉన్న అల్లు శిరీష్‌కు మాత్రం ఒడిదుడుకులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ లవ్‌ స్టోరీతో వచ్చేశారు. అల్లు శిరీష్‌.

“ఊర్వశివో రాక్షసివో” అనే సినిమాతో ఇప్పుడు వచ్చేశారు అల్లు హీరో శిరీష్‌. ఈ సినిమాలో ఫస్ట్‌ పోస్టర్‌ ను కాసేపటి క్రితమే.. గీతా ఆర్ట్స్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌ గా నటిస్తున్నారు. తాజాగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌ లో అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్ చాలా రొమాంటిక్‌ గా కనిపించారు. ఇక ఈ సినిమా గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ పై తెరకెక్కుతుండగా… రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా టీజర్‌ ను సెప్టెంబర్ 29న విడుదల చేస్తున్నట్లు ఈ పోస్టర్‌ ద్వారా వెల్లడించింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Latest news