కొవిషీల్డ్‌తో అరుదుగా దుష్పరిణామాలు : ఆస్ట్రాజెనెకా

-

కొవిడ్‌ టీకా కోవిషీల్డ్‌తో అరుదుగా దుష్పరిణామాలు ఏర్పడే ప్రమాదం ఉందని బ్రిటిష్‌ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తెలిపింది. ఈ మేరకు బ్రిటన్‌కు చెందిన ప్రముఖ దినపత్రిక ది టెలిగ్రాఫ్‌ ఓ కథనం ప్రచురించింది. కోవిషీల్డ్ టీకా వల్ల అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డకట్టడానికి, ప్లేట్‌లెట్ కౌంట్‌ పడిపోవటం వంటి పరిస్థితులకు దారితీయవచ్చని అంగీకరించింది. కోర్టుకు సమర్పించిన దస్త్రాల్లో ఈ విషయం పేర్కొనట్లు తెలిపింది.

కోవిషీల్డ్‌ కరోనా టీకా అనేక సందర్భాల్లో మరణాలతోపాటు తీవ్ర గాయాలకు కారణమైనట్లు ఆరోపిస్తూ. బ్రిటన్‌ హైకోర్టులో 50మందికిపైగా బాధితులు 100  మిలియన్ పౌండ్ల నష్ట పరిహారం కోరుతూ ఆస్ట్రాజెనెకాపై కేసులు వేశారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన ఆస్ట్రాజెనెకా.. అరుదైన సందర్భాల్లో సెడ్‌ ఎఫెక్ట్స్‌ కలిగే అవకాశం ఉందని ఫిబ్రవరిలో కోర్టుకు సమర్పించిన ఓ నివేదికలో పేర్కొంది. కరోనా సమయంలో కోవిషీల్డ్‌ టీకాను బ్రిటన్‌ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అభివృద్ధి చేయగా భారత్‌కు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేసింది. ఈ టీకాలనే దేశ విదేశాల్లో విస్తృతంగా వినియోగించారు.

Read more RELATED
Recommended to you

Latest news