అక్టోబర్ ఒకటి నుండి 7 కొత్త రూల్స్… వీటిలో మార్పులట జాగ్రత్త…!

-

ప్రతీ నెలా కూడా కొన్ని అంశాలు మారుతూ ఉంటాయి. అలానే ఈ అక్టోబర్ నెలలో కూడా కొన్ని మార్పులు వస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్ రూల్స్ మొదలు స్కీమ్స్ దాకా పలు అంశాల్లో మార్పులు రానున్నాయి. మరి అవేమిటో చూద్దాం.

మ్యూచువల్ ఫండ్స్:

మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు ఇక నుండి నామినేషన్ వివరాలను ఇవ్వాలి. లేదంటే డిక్లరేషన్ దాఖలు చేయాలి. 1 అక్టోబర్ 2022 నుండి ఈ కొత్త రూల్ వస్తోంది.

అటల్ పెన్షన్ యోజన:

అక్టోబర్ 1 నుంచి ఈ ప్లాన్‌లో మార్పులు రానున్నాయి. ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టాలంటే సెప్టెంబర్ 30 వరకే టైం వుంది. ఆ తరవాత డబ్బులు పెట్టేందుకు అవుతుంది. అటల్ పెన్షన్ యోజన లో కూడా మార్పులు వచ్చాయి కనుక జాగ్రత్తగా చూసుకోండి.

కార్డ్ టోకనైజేషన్ నియమాలు:

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్ ఒకటి నుండి కొత్త మార్పు తీసుకు వచ్చింది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వినియోగదారుల కోసం కార్డ్-ఆన్-ఫైల్ టోకనైజేషన్ తీసుకొచ్చింది. ఇది కూడా వచ్చే నెల నుండి అమలులోకి వస్తోంది.

డీమ్యాట్ అకౌంట్:

డీమ్యాట్ ఖాతాలో టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆప్షన్‌ని ఎనేబుల్ చెయ్యాలి. అది కూడా సెప్టెంబర్ 30లోగా.

రేపో రేట్:

రిజర్వ్ బ్యాంక్ రెపో వడ్డీ రేటును పెంచే అవకాశం కనపడుతోంది. సెప్టెంబర్ 30న జరిగే మీటింగ్ లో దీన్ని ప్రకటించనుంది.

గ్యాస్ ధరలు:

ప్రతీ నెలా కూడా గ్యాస్ ధరలలో మార్పులు వస్తుంటాయి. ఈ నెల కూడా మార్పు వస్తుంది. మరి పెరుగుతాయా తగ్గుతాయా అనేది చూడాలి.

రెస్టారెంట్, హోటల్స్:

ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ FSSAI ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు నగదు రసీదులపై FSSAI లైసెన్స్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్‌ను తప్పనిసరిగా ఉంచాలి.

Read more RELATED
Recommended to you

Latest news