చై కెరీర్‌లో బిగ్‌ డీల్‌.. భారీ ధరకు ‘తండేల్‌’ ఓటీటీ రైట్స్‌

-

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ప్రధాన పాత్రలో చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘తండేల్‌’. సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. దేశభక్తి అంశాలతో నిండిన రా రస్టిక్‌ ప్రేమకథతో ఇది తెరకెక్కుతోంది. చైతన్య ఇందులో రాజు అనే మత్స్యకారుడిగా కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ డీల్‌ పూర్తయింది.

చైతూ కెరీర్‌లోనే అత్యధికంగా రూ.40 కోట్లకు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ ఈ మూవీ రైట్స్‌ను దక్కించుకుంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ‘తండేల్‌’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. థియేట్రికల్‌ రన్‌ ముగిసిన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానున్నట్లు సదరు సంస్థ తెలిపింది. ఈ సినిమాలో ఇంతకు ముందెప్పుడూ చేయని సరికొత్త పాత్రలో చైతూ.. సాయిపల్లవి డీగ్లామర్‌ లుక్స్‌లో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్న ‘తండేల్‌’ను బన్ని వాసు నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను పంచుకోనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news