బెంగళూరు టెకీల వెరైటీ స్టార్టప్‌.. రెంట్‌కు బాయ్ ఫ్రెండ్

-

బెంగళూరు టెకీలు సరికొత్త ట్రెండ్ కు తెరతీశారు. గంటల ఆధారంగా అద్దెకు బాయ్ ఫ్రెండ్ ను ఇస్తామంటూ కొందరు టెకీలు ఓ వెబ్ సైట్ ను ప్రారంభించడం దేశంలో సంచలనం సృష్టించింది. ప్రియుడి చేతిలో మోసపోయామనో, లవ్ ఫెయిల్ అయిందనో, నిజమైన ప్రేమ దక్కలేదనో బాధకు గురవుతున్న వారికి కాస్త ఉపశమనం కోసం ‘టాయ్‌ బాయ్‌’ పేరిట వీరు ఒక పోర్టల్‌ను ప్రారంభించారు.

ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ఆ ‘బాయ్‌’ ఎవరి వద్దకూ భౌతికంగా రాడు. ఫోన్‌ ద్వారా వారి సమస్యను పూర్తిగా విని మానసిక ఆందోళనను దూరం చేసేందుకు సహకారం అందిస్తాడని పోర్టల్‌ను అభివృద్ధి చేసిన కౌశల్‌ ప్రకాశ్‌ తెలిపారు. దీనినొక స్టార్టప్‌గా తాము రూపొందించామని, దీంతో పాటు ఆర్‌ఏబీఎఫ్‌ అనే యాప్‌ను అభివృద్ధి చేశామని ఆయన పేర్కొన్నారు. తమ పోర్టల్‌, యాప్‌లోని సేవలను నిర్ణీత రుసుము చెల్లించి, వినియోగించుకోవలసి ఉంటుందని వివరించారు. ప్రేమలో విఫలమైన యువతులకు ఉద్దేశించి ‘టాయ్‌ బాయ్‌’ పేరుతో అబ్బాయిలను అద్దెకు (ఫోన్‌ ద్వారా) ఇస్తామనడమే ఇక్కడ వివాదాస్పదంగా మారింది. దీని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news