రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఊతం ఇవ్వడం కోసం మంత్రి.. 28,866.23 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
అమరావతి: ఏపీ శాసనసభలో పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. నిజానికి.. వ్యవసాయ బడ్జెట్ ను ఏపీ వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశపెట్టాల్సింది కానీ.. ఆయన సోదరుడు హఠన్మరణం చెందడంతో కురసాల వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టలేకపోయారు.
ఇక.. రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఊతం ఇవ్వడం కోసం మంత్రి.. 28,866.23 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
రైతుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం అంకితమవుతోందని.. రైతులకు దీర్ఘకాలంగా మేలు చేసేలా ముందుకు కదులుతున్నామన్నారు. సుదీర్ఘ పాదయాత్రలో రైతుల కష్టాలు చూసి జగన్ చలించారన్నారు. అందుకే మ్యానిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి అమలు చేస్తున్నామన్నారు. కౌలు రైతు కుటుంబాలకు కూడా మేలు చేయాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు బొత్స తెలిపారు.
వైఎస్సార్ రైతు భరోసా కింద బోర్ల తవ్వకానికి 200 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. రైతులకు విత్తనాల సరఫరా కోసం 200 కోట్లు, మత్స్యకారులకు ఆర్థిక సాయం కోసం 100 కోట్లు, చేపల జెట్టీలు, హార్బర్ల కోసం 100 కోట్లు. మత్స్యకారుల పడవలకు డీజిల్ రాయితీ కింద 100 కోట్లు.
వైఎస్సార్ రైతు బీమా కోసం 1163 కోట్లు. దీనిలో భాగంగా ప్రకృతి విపత్తలు నిధికి 2002 కోట్లు, ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీకి 475 కోట్లు, రైతులకు ఉచిత బోర్ల కోసం 200 కోట్లు, విత్తనాల పంపిణీ కోసం 200 కోట్లు కేటాయించారు.