వీఐపీలకు ఇస్తున్న ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలను రద్దు చేస్తామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వీఐపీలు ఏడాదిలో ఒకసారే శ్రీవారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం జరగాలంటే సామాన్య ప్రజలు గంటలకు గంటలు లైన్లలో వేచి ఉండాల్సిందే. ఎందుకంటే తిరుమలకు వచ్చే భక్తులు లక్షల్లో ఉంటారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. స్వామి వారి దర్శనం కోసం గంటలు గంటలు వేచి చూడాల్సిందే. అయితే.. ఇకనుంచి సామాన్య జనానికి తొందరగా దర్శనం కలిగించడం కోసం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వీఐపీలకు ఇస్తున్న ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలను రద్దు చేస్తామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వీఐపీలు ఏడాదిలో ఒకసారే శ్రీవారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తితిదే పాలకమండలి సభ్యులను 10 రోజుల్లో సీఎం నియమిస్తారని టీటీడీ చైర్మన్ వెల్లడించారు.