బన్నీ-పూజ మధ్య రెండు, మూడు సన్నివేశాల్లో ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలున్నాయని యూనిట్ వర్గాల నుంచి లీకైంది. స్టోరీ డిమాండ్ చేయడంతోనే? ఆ సన్నివేశాలు తప్పక పెట్టాల్సి వస్తోందిట.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలు ఎంత క్లీన్ గా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ ఆరంభం నుంచి ఆ విషమయంలో రిమార్కులు లేకుండా జాగ్రత్త పడుతున్నాడు. కేవలం కంటెంట్ పై కాన్పిడెన్స్ తోనే గ్లామర్ జోలికి వెళ్లడు. హీరోయిన్లను డీగ్రేడ్ గా చూపించడం, హీరో, హీరోయిన్ మధ్య లిప్ లాక్ లు..బెడ్ రూమ్ సన్నివేశాలు లాంటివి ఎక్కడా ఉండవు. కథ, మాటలు, కథనంతోనే తన బ్రాండ్ ను చాటుకున్నాడు. అలాంటి వెజిటేరియన్ దర్శకుడిప్పుడు నాన్ వెజ్ పనులు చేయిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో బన్ని సరసన పూజాహెగ్దే నటిస్తోంది.
బన్నీ-పూజ మధ్య రెండు, మూడు సన్నివేశాల్లో ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలున్నాయని యూనిట్ వర్గాల నుంచి లీకైంది. స్టోరీ డిమాండ్ చేయడంతోనే? ఆ సన్నివేశాలు తప్పక పెట్టాల్సి వస్తోందిట. నిజానికి ఆసన్నివేశాలు ముందు తీసేయాలనుకున్నారుట. కానీ బన్నీ తీసేస్తే కథలో ఫీల్ మిస్ అవుతుందని కన్వెన్స్ చేసాడుట. దీంతో ఆయన మాట కాదనలేక త్రివిక్రమ్ కాంప్రమైజ్ అయినట్లు సమాచారం. తదుపరి జరగబోయే షెడ్యూల్ లో ముందుగా ఆ సన్నివేశాలనే చిత్రీకరించనున్నారుట. అయితే అవి ఒరిజినల్ గా షూట్ చేస్తారా? గ్రాఫిక్స్ తో మ్యానేజ్ చేస్తారా? అన్న దానిపై మాత్రం సరైన క్లారిటీ లేదు. గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు బిజినెస్ మెన్ సినిమాలో కాజల్ అగర్వాల్ తో ఓ లిప్ లాక్ సన్నివేశంలో నటించిన సంగతి తెలిసిందే.
ఆ సీన్ చూడటానికి రియల్ గా నటించారనిపిస్తుంది. కానీ అదంతా మేకప్ మాత్రమే. కానీ ఇప్పుడు హీరోలంతా లిప్ లాక్ ల్లో ఒరిజినల్ గానే నటిస్తున్నారు. హీరోయిన్ల నుంచి అభ్యంతరాలు ఉండటం లేదు కాబట్టి దర్శకులకు పని ఈజీ అవుతుంది. మరి బన్నీ కోరి పెట్టించాడు కాబట్టి వాస్తవికంగా షూట్ చేస్తారా? గ్రాపిక్స్ తో మ్యానేజ్ చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. బన్నీ-పూజ గతంలో డీజే లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కెమిస్ర్టీ సమస్య కూడా ఉండదు.