మునుగోడు బై పోల్..రంగంలోకి దిగనున్న మంత్రి హరీష్, కేటీఆర్..

-

సోమవారం రోజున మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ నెల 7 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుండగా, నవంబర్ 3న ఎన్నిక జరగనుంది..నవంబర్ 6న ఫలితం వెలువడనుంది. అంటే సరిగ్గా చూసుకుంటే ఒక నెలలో మొత్తం ప్రక్రియ పూర్తి అయిపోతుంది. ఈ తరుణంలోనే సీఎం కేసీఆర్‌ గేమ్‌ ప్లాన్‌ పూర్తిగా మార్చేశారు.

మునుగోడు ఇంఛార్జి లకు సీఎం కేసీఆర్‌ ఫోన్..చేశారు. ఆరవ తేదీ నుంచి స్థానికంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు కేసీఆర్‌. దసరా రోజే మునుగోడు అభ్యర్థి అధికారిక ప్రకటన ఉంటుందని పేర్కొన్నారు. ఇక మునుగోడు నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించిన టీఆర్ఎస్…ప్రతి యూనిట్ కు ఒక ఎమ్మెల్యేదే బాధ్యత ఇచ్చేలా ప్లాన్‌ చేసింది. అటు తెలంగాణ మంత్రులు కేటీఆర్ ,హరీష్ రావుతో పాటు పలువురు సీనియర్ నేతలకు యూనిట్ బాధ్యతలు అప్పగించనున్నారు సీఎం కేసీఆర్‌. అలాగే.. మునుగోడులో కేసీఆర్ సభకు ప్లాన్ చేస్తున్నారు నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news