మంచిగా ఏదైనా టూర్ వేయాలనుకుంటున్నారా..? అయితే ఈ ప్యాకేజీని చూడాల్సిందే. 12 జ్యోతిర్లింగాలను చాలా మంది దర్శించుకోవాలని అనుకుంటారు. అయినప్పటికీ వెళ్ళడం కుదరకపోవచ్చు. అయినా అన్నింటినీ ఒకేసారి చూడడం అవ్వదు. అందుకోసమే IRCTC మధ్యప్రదేశ్‌లోని రెండు జ్యోతిర్లింగాల దర్శనం కోసం ప్యాకేజీని తీసుకు వచ్చింది.
ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..ప్రతి బుధవారం హైదరాబాద్ నుండి ఈ టూర్ ఉంటుంది. భూపాల్, ఉజ్జెయిన్, ఖండ్వా వంటి వాటిని చూసేయచ్చు. ఈ టూర్ ప్యాకేజీ వచ్చేసి మొత్తం ఐదు రాత్రులు, ఆరు రోజులు.
బుధవారం సాయంత్రం 4:40 గంటలకు కాచీగూడ నుంచి ఈ టూర్ స్టార్ట్ అవుతుంది. సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్ ఎక్కితే భూపాల్ రైల్వేస్టేషన్లో దిగుతారు. అక్కడ స్థానికంగా ఉండే సంచి స్థూప, ట్రైబల్ మ్యూజియం, తాజ్ ఉల్ మస్జిద్ చూడచ్చు.
మూడవ రోజైతే ఉజ్జెయిన్ చూడచ్చు. అక్కడ టెంపుల్స్ కి వెళ్ళచ్చు. మరుసటి రోజు ఓంకారేశ్వర్‌కు వెళ్లి జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటారు. ఐదో రోజు మహేశ్వర్ చేరుకొని అహిల్యాదేవి కోట, మండు కోటలను చూడచ్చు. ఇండోర్‌లోని అంబేడ్కర్ నగర్ రైల్వేస్టేషన్లో డ్రాప్ చేస్తారు. రైలులో హైదరాబాద్ చేరుకుంటారు.
ఇక ప్యాకేజీ ధరల విషయానికి వస్తే..
కంఫర్ట్ క్లాస్‌లో ఒక మనిషికి రూ.32,080, ఇద్దరుకి రూ.18,230 , ముగ్గురుకి రూ.14,300.
స్టాండర్డ్ క్లాస్ లో ఒక మనిషికి రూ.29,590, ఇద్దరికి రూ.15,740, ముగ్గురికి రూ.11,820.
అదే పిల్లలు కూడా ట్రావెల్ చేస్తుంటే వాళ్లకి కూడా ఎక్స్ట్రా చార్జెస్ పడతాయి. పూర్తి వివరాలను IRCTC అధికారిక వెబ్ సైట్ లో చూడచ్చు.