కాకరకాయ తినడం వల్ల ఎన్నో లాభాలు పొందొచ్చు. కానీ చేదుగా ఉంటుందని చాలా మంది కాకరకాయని దూరం పెడుతూ ఉంటారు. కాకర లో వుండే చేదుని తొలగిస్తే కాకరకాయ తాలూకా లాభాలను పొందేందుకు అవుతుంది. అయితే మరి కాకరకాయలో ఉండే చేదుని ఎలా తొలగించవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. కాకరకాయలలో చక్కటి పోషక పదార్థాలు నిండి ఉంటాయి ఒకవేళ ఎంత చేదును తొలగిస్తే పోషకపదార్థాలను పొందొచ్చు.
ఉప్పు లో వేసి కడగండి:
కాకరకాయతో ఏదైనా రెసిపీ చేసే ముందు కాకరకాయ ముక్కల్ని తీసుకుని సాల్ట్ ని జల్లండి. అరగంట పాటు అలాగే వదిలేసి ఆ తర్వాత బాగా కడిగి వండండి. ఇలా చేయడం వల్ల సులభంగా కాకరకాయలో ఉండే చేదుని తొలగించుకోవచ్చు.
తొక్కని తొలగించండి:
ముక్కలను తరిగినప్పుడు లోపలి భాగం ఎక్కువ ఉండేటట్టు చూడండి. పైభాగాన్ని తొలగించడం ద్వారా చేదుని కాస్త తగ్గించవచ్చు.
ఉప్పు నీటిలో వేసి మరిగించండి:
నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసి అందులో కాకరకాయ ముక్కలు వేసి ఐదు నిమిషాల పాటు కాకరకాయ ఉంచితే దానిలో ఉండే చేదు తొలగిపోతుంది.
గింజల్ని తొలగించండి:
గింజలను తొలగించి ముక్కలు కట్ చేయడం వలన కాకరకాయలో ఉండే చేదు తగ్గించొచ్చు.
డీప్ ఫ్రై చెయ్యండి:
డీప్ ఫ్రై చేయడం వల్ల కాకరకాయలో ఉండే చేదు తొలగిపోతుందట. కావాలంటే ఈ సారి ఇలా కూడా ప్రయత్నం చేయండి.
పెరుగులో వేసి నానబెట్టండి:
ఒక గంట పాటు పెరుగులో కాకరకాయ ముక్కలు వేసి ఉంచడం వల్ల చేదు తగ్గిపోతుంది.
పంచదార మరియు వెనిగర్:
పంచదారను, కాకరను సమపాళ్ళలో తీసుకుని దానిలో కాకరకాయ ముక్కలు వేసి ఉంచడం. ఇలా చేదుని తొలగించొచ్చు.