బెంగళూరు వేదికగా జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో పుష్ప చిత్రం తన సత్తా చాటింది. దక్షిణ భారత చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం అట్టహాసంగా జరిగింది. కరోనా పరిస్థితిలతో గడిచిన కొన్నేళ్లు నిరాడంబరంగా జరిగిన ఈ వేడుక, ఈ ఏడాది స్టార్ నటీనటుల సమక్షంలో ఘనంగా జరిగింది.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ కు ఈ ఏడాది ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం వరించింది. ఈసారి ఫిలింఫేర్ లో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన టాలీవుడ్ చిత్రం ‘పుష్ప’ హవా నడిచింది. మొత్తం 7 విభాగాల్లో ఆ చిత్రం సత్తా చాటింది. తమిళంలో సూర్య కథానాయకుడిగా నటించిన ‘సురారై పొట్రు’, ఏది అవార్డులను దక్కించుకుంది.
తెలుగు చిత్రాలకు దక్కిన ఫిల్మ్ ఫేర్ అవార్డులు
ఉత్తమ చిత్రం – పుష్ప: ది రైజ్
ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ (పుష్ప: ది రైజ్)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – నాని (శ్యామ్ సింఘా రాయ్)
ఉత్తమ నటి – సాయి పల్లవి (లవ్ స్టోరీ)
ఉత్తమ నటి (క్రిటిక్స్) – సాయి పల్లవి (శ్యామ్ సింఘా రాయ్)
ఉత్తమ దర్శకుడు – సుకుమార్ (పుష్ప: ది రైజ్)
ఉత్తమ సహాయ నటుడు – మురళీ శర్మ (అల వైకుంఠపురములో)
ఉత్తమ సహాయ నటి – టబు (అల వైకుంఠపురములో)
ఉత్తమ తొలి నటుడు – పంజా వైష్ణవ్ తేజ్ (ఉప్పెన)
ఉత్తమ తొలి నటి – కృతి శెట్టి (ఉప్పెన)
ఉత్తమ సంగీత ఆల్బమ్ – దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప: ది రైజ్)
ఉత్తమ సాహిత్యం – సిరి వెన్నెల సీతారామ శాస్త్రి (జాను)
ఉత్తమ గాయకుడు – సిద్ శ్రీరామ్ (పుష్ప: ది రైజ్)
ఉత్తమ గాయని – ఇంద్రావతి చౌహాన్ (పుష్ప: ది రైజ్)
ఉత్తమ కొరియోగ్రఫీ – శేఖర్ మాస్టర్ (అల వైకుంఠపురములో)
ఉత్తమ సినిమాటోగ్రఫీ – మిరోస్లా కుబా బ్రోజెక్ (పుష్ప: ది రైజ్)
లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు – అల్లు అరవింద్