జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ కుంభకర్ణుడు అంటూ ఏపీ మంత్రి మంత్రి రోజా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దేనికి ఈ గర్జనలు..అంటూ, జగన్ సర్కారుపై పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు చేస్తున్నారు. అయితే.. పవన్ కళ్యాణ్ ట్వీట్లకు కౌంటర్ గా.. ఏపీ మంత్రి మంత్రి రోజా తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు.
పవన్ కుంభకర్ణుడి లాగా 6 నెలలు నిద్రపోయి, 6 నెలలు మేల్కొంటాడని మంత్రి రోజా విమర్శించారు. ప్రభుత్వంపై విచిత్ర ట్వీట్లు చేస్తున్నాడని మండిపడ్డారు. ఒక స్టార్ గా ఎదిగి ప్రజలకు ఏం చేశారని, రాజకీయాలంటే ఆయనకు సీరియస్ నెస్ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐదేళ్లు బిజెపి, టిడిపి తో తిరిగినప్పుడు ఉత్తరాంధ్ర వలసలు కనిపించలేదా అని నిలదీశారు. సీఎం జగన్ పాలనలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ప్యాకేజీ కోసం మొరిగే వాళ్ళకి గర్జన అర్ధమవుతుందా? అంటూ అటు అంబటి కూడా ట్వీట్ చేశారు. దత్త తండ్రి చంద్రబాబు తరఫున.. దత్త పుత్రుడి పవన్ కళ్యాణ్ మియావ్ మియావ్ అంటూ గుడివాడ అమర్ న్నాధ్ కౌంటర్ ఇచ్చారు.