జగన్ సర్కార్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాలంటీర్ల పాత్ర ఉండకూడదని కేంద్ర ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. ఏపీలో త్వరలోనే జరిగే గ్రాడ్యయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రామ మరియు వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాత్ర ఉండకూడదని కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ఎంకే మీనా తేల్చి చెప్పారు.
ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ అభ్యర్థులు కంచర్ల శ్రీకాంత్ చౌదరి, భూమిరెడ్డి రాం గోపాల్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల కమిషన్ ఈ సూచనలు చేసింది. దీంతో జగన్ సర్కార్ కు బిగ్ షాక్ తగిలింది. దీనిపై వైసీపీ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.