చారిత్రక గండిపేట జలాశయం తీరంలో పర్యటకులను కనువిందు చేసేలా కొత్త అందాలను జోడిస్తూ సర్వంగా సుందరంగా 5.50 ఎకరాల విస్తీర్ణంలో సరికొత్త పార్కు నిర్మితమైంది. ఈ పార్కును రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించానున్నారు. ఈ పార్కులో ఓపెన్ ఎయిర్ థియేటర్ ప్రత్యేకమైన ఆకర్షణ. చక్కటి సీటింగ్ సదుపాయంతో ఉండే ఈ థియేటర్ పర్యటకులకు గొప్ప అనుభూతిని ఇవ్వనుంది.
పార్కు అందాలను ద్విగినీకృతం చేసేలా స్వాగత ద్వారాన్ని భారీ ఆకృతిలో నిర్మించారు. సందర్శకులతో పాటు వాకింగ్ కు వచ్చే వారికోసం నడకదారులు ఏర్పాటు చేయనున్నారు. ఈ పార్కులో పిల్లలు ఆడుకునే రకరకాల పరికరాలను కూడా అందుబాటులో ఉంచారు. ఉస్మాన్ సాగర్ సమీపంలో 85 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండిఏ ఏర్పాటు చేసిన కొత్వాల్ గూడా ఏకో పార్కును సుమారు రూ.75 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు.