ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

-

ఎపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర మంత్రి వర్గంలోని బిసి మంత్రులకు స్వేచ్చలేదని.. కుటుంబ పార్టీల వల్ల బిసిలకు అన్యాయం జరుగుతోందన్నారు. ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఒక రోజు పాటు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ఓబిసి మోర్చా అధ్యక్షుడు రొంగల గోపీ శ్రీనివాస్ అధ్యక్షతన ప్రారంభమైంది.

కార్యవర్గ సమావేశానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ప్రారంభ సమావేశంలో సోమువీర్రాజు మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పనిచేస్తున్న పార్టీ బీజేపీ అన్నారు డినోటిఫైడ్ ట్రైబ్స్ కోసం ప్రధాన మంత్రి 10 వేలకోట్ల బడ్జెట్ ను ప్రత్యేకంగా కేటాయించారని కేంద్ర ప్రభుత్వం వల్లే బిసిలకు సముచిత గౌరవం దక్కుతోందని సోమువీర్రాజు అన్నారు. “సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారిని అభివృధి వైపు తీసుకెళ్తున్నారు మోడీ.

ఆర్ధికంగా ప్రపంచం లో 5దవ స్థానానికి తీసుకెళ్ళిన ఘనత మోడీ ది. నిమ్న వర్గాల వర్గీకరణ చేయమన్న వైసీపీ పటించుకోవట్లేదు. వైసీపీ,టీడీపీ పార్టీలు తమలపాకులు బిసి లకు, తాంబూలాలు అగ్ర వర్ణాలకు ఇచ్చారు.ఏపిలో బిసిలకు,ఎస్.సి లకు పదవులు ఇచ్చారు కానీ వారికి పవర్ ఇవ్వలేదు.రాష్ట్రంలో మైండ్ గేమ్ పాలిటిక్స్ నడుపుతుంది వైసీపీ.క్యాపిటల్ కట్టకుండా నాటకాలు ఆడుతున్నారు. రాయలసీమ కు నీళ్ళు ఇవ్వని కెసిఆర్ పై మాట్లాడే దమ్ము లేదు వైసీపీకి.

నడి రోడ్డు పై రైతులు రాజధాని కోసం నడుస్తుంటే రాజకీయం చేస్తున్నారు.వైసిపి నాయకులకు వ్యక్తిత్వం లేదు.సీఎం ఇచ్చిన స్క్రిప్ట్ మంత్రులు,ఎమ్మెల్యే లు చదువుతున్నారు.కుటుంబ రాజకీయులు.. దందాలు, అవినీతి కోసం ప్రాంతీయ పార్టీలున్నాయన్నారు. భాద్యతగా ఏపి అభివృధి కోసం ఆలోచన చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. 60 సంవత్సరాలు గా చేయలేని అభివ్రుద్ది ప్రధానమంత్రి నరేంద్రమోదీ 8 సంవత్సరాల్లో చేశారని అదేవిధంగా అభివ్రుద్ది విషయంలో బ్రిటన్ దేశాన్ని దాటుకుని ఉన్నామన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.

సోలార్ పవర్ ను విదేశాలకు ఇచ్చే పరిస్థితికి త్వరలో చేరుకోబోతున్నామని ఆవిధంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాటలు వేస్తున్నారన్నారు. ఓబిసి మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్పాల్ జీ మాట్లాడుతూ ఓబిసిలకు న్యాయం చేసిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక్కరేనన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ కేవలం ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ వచ్చిన తరువాత మాత్రమే ఓబిసిల కున్యాయం జరిగిందని పలు ఉదాహారణలు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news