కేంద్ర హోం మంత్రి అమిత్ షాకీ లేఖ రాశారు ఎంపీ రఘురామకృష్ణరాజు. అమరావతి రైతుల పాదయాత్రకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. యాత్రకు ఆటంకం కలిగించేందుకు వైసిపి నేతలు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పాదయాత్రను భగ్నం చేసేందుకు వైసిపి నేతలు కుట్ర పన్నుతున్నారని.. మంత్రులు, వైసీపీ నేతల వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను కూడా లేఖకు జతచేసి పంపారుు రఘురామకృష్ణరాజు.
అమరావతి రైతుల పాదయాత్రకు ఏదో ఒక విధంగా భగ్నం కలిగించేందుకు కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. పాదయాత్రలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు.