తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..త్వరలోనే 15 లక్షల సిసి కెమెరాల ఏర్పాటు

-

గోషా మహల్ పోలీస్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా పోలీస్ అమర వీరుల దినోత్సవం నిర్వహించారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం లో రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి,పలువురు సీనియర్ పోలీస్ ఉన్నత అధికారులు, రిటైర్డ్ పోలీస్ అధికారులు పాల్గొని పోలీస్ అమరవీరులకు శ్రేద్దంజలి ఘటించారు. అమరులైన పోలీసుల సంపుటికను హోంమంత్రి మహమూద్ అలీ రాష్ట్ర డిజిపి కి అందజేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసుల అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నాము.. దేశ, ధన,మాన ప్రాణాలను కాపాడుతూ విధినిర్వహణలో అమరులైన వారిని ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని పేర్కొన్నారు. ఈ సంవత్సరం 264మంది పోలీసులు విధినిర్వహణలో అమరులైయ్యారు..తెలంగాణ రాష్ట్రాన్ని నెరరాహిత రాష్ట్రంగా మార్చడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు.

పౌర హక్కులను కాపాడుతూ,ప్రజలకు నిరంతరం పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని.. నెరరాహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే పద్ధతి లో భాగంగా అనేక సిసి కెమెరాలు,పోలీసు స్టేషన్లను అదునికరించి,ఫ్రెండ్లి పోలీస్ తో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రజలకు రక్షణ కల్పిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలనుండి,గ్రామలవారిగా 10లక్షల వరకు సీసీ కెమెరా లు ఏర్పాటు చేశాము.. రానున్న రోజుల్లో 15 లక్షల సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం లక్ష్యమని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news