అల్లు అరవింద్- దిల్ రాజ్ ద్వయం నిర్మాతలుగా బాలీవుడ్ లోనూ రాణించాలని ఉత్సాహం చూపిస్తున్నారు. అరవింద్ కి అక్కడ ఉన్న పరిచయాలతో రాజుగారితో భాగస్వామి అయి సినిమాలు నిర్మించడానికి సన్నాహాకాలు చేస్తున్నాడు. ముఖ్యంగా తెలుగు బ్లాక్ బస్టర్లను అక్కడి హీరోలతో రిమేక్ చేసి సక్సెస్ లు కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. మన హిట్ కథలను పక్క పరిశ్రమలకు అమ్మడం ఏంటి? అదేదో మనమే చేసేస్త రెండు చేతుల సంపాదనే అన్న ఆలోచనతో ద్వయం చేతులు కలిపింది. ఇప్పటికే నాని కథానాయకుడిగా నటించిన జెర్సీని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఓ యంగ్ హీరోతో….కుదిరితే మాతృక దర్శకుడితోనే అక్కడా రీమేక్ చేయాలని చూస్తున్నారు.
అయితే వీళ్లిద్దరి మధ్యలో దర్శక, నిర్మాత కరణ్ జోహార్ తలపెట్టాడు. వాళ్ల ప్లాన్ని ముందే ఊహించి తెలుగు హిట్ కథలను తన్నుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడని తాజా సన్నివేశం చెబుతోంది. విజయ్ దేవరకొండ కథానాయుకుడిగా భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన డియర్ కామ్రేడ్ హిందీ రైట్స్ ను సినిమా రిలీజ్ కాకుండానే కరణ్ చేజిక్కించుకున్నాడు. చిత్ర నిర్మాతలు, హీరోతో కలిసి నిన్నటి రోజున హైదరాబాద్ లో సినిమా చూసాడు. సినిమా నచ్చడంతో రీమేక్స్ రైట్స్ కోసం అడ్వాన్స్ కూడా చెల్లించాడు. ఆ విషయాన్ని తెలుగు మీడియాకు వెల్లడించాడు.
ఈ విషయం తెలియడంతో అరవింద్ -దిల్ రాజు షాకయ్యారుట. రిలీజ్ కు ముందే కరణ్ కు అంత నమ్మకం ఏంటని సన్నిహితుల వద్ద అంటున్నారుట. వాస్తవానికి ఈ సినిమా హిందీ రైట్స్ ను అరవింద్ తీసుకోవాలనుకున్నాడుట. సినిమా రిలీజ్ అయిన తర్వాత టాక్ ను బట్టి నిర్ణయం తీసుకుందామని వెయిట్ చేస్తున్నాడుట. కానీ ఇంతలోనే కరణ్ కరణ్ జోహార్ కర్చీప్ వేసేసాడు. కారణాలు ఏవైనా దిల్ రాజు-అరవింద్ త్రయానికి పెద్ద దెబ్బే. కరణ్ కి టాలీవుడ్ లో మంచి కాంటాక్స్ట్ ఉన్నాయి. బాలీవుడ్ లో పెద్ద నిర్మాత కాబట్టి టాలీవుడ్ నిర్మాణ సంస్థలు కూడా కరణ్ ఆఫర్ ని కాదనలేరు. కాబట్టి అరివింద్-దిల్ రాజు ఆలోచనలను కరణ్ ఆదిలోనే తొక్కేసేలా కనిపిస్తున్నాడు.