గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌.. వీరసింహారెడ్డిగా వస్తున్న బాలయ్య..

-

‘అఖండ’ తో సక్సెస్ ట్రాక్ ఎక్కినా నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో #NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన బాలకృష్ణ ఫస్ట్ లుక్ – ఇతర స్పెషల్ పోస్టర్స్ మరియు ఫస్ట్ హంట్ టీజర్ నందమూరి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ను లాంచ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు. #NBK107 టైటిల్ ను కర్నూలులోని ఐకానిక్ కొండారెడ్డి బురుజు దగ్గర లాంచ్ చేయనున్నట్లు ఇది వరకే ప్రకటించారు.

Balakrishna In Action As Veera Simha Reddy

ఈరోజు శుక్రవారం (అక్టోబర్ 21) రాత్రి 8.15 నిమిషాలకు జరగనున్న వేడుకలో ఈ సినిమా టైటిల్ ను ప్రకటించారు. సమర సింహా రెడ్డి’, ‘నరసింహ నాయుడు’, లక్ష్మీ నరసింహ’, ‘జై సింహ’ ‘బొబ్బిలి సింహ’ – సింహ టైటిల్‌లో వచ్చిన బాలకృష్ణ ప్రతి సినిమా బాక్సాఫీస్ బరిలో భారీ విజయం నమోదు చేసింది. అంతే కాదు… ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు గోపీచంద్ మలినేని సినిమాకు ‘వీర సింహా రెడ్డి’ టైటిల్ ఖరారు చేయడంతో ఇదీ భారీ హిట్ అని నందమూరి అభిమానులు సంతోషంగా చెబుతున్నారు. ఈ చిత్రానికి God Of Masses అనేది ఉపశీర్షిక.

Read more RELATED
Recommended to you

Latest news