కరోనా తర్వాత నుంచి ఆన్లైన్ పేమెంట్స్ ఎక్కువ అయ్యాయి..బ్యాంక్ కు వెళ్ళి గంటలు వెయిట్ చెయ్యడం కన్నా ఇంట్లోనే కూర్చోని డబ్బులను పంపే డిజిటల్ పేమెంట్స్ వైపు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అరచేతి లో సెల్ ఫోన్ ఉంటే చాలు క్షణాల్లో డబ్బును ఒకరి నుంచి మరోకరికి బదిలీ చేయవచ్చు. ఇలా డబ్బు పింపించే క్రమంలో పేమెంట్ ప్లాట్ ఫామ్స్ నుంచి మనీ రివార్డ్స్, గిఫ్ట్ కూపన్లు సైతం వస్తుంటాయి. అయితే ఎప్పటికప్పుడు ఈ పేమెంట్ ప్లాట్ ఫామ్స్ యూజర్లను ఆకట్లుకోవడానికి కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నారు.దాంతో చాలామంది వీటిని వాడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే గూగుల్ పే తమ యూజర్లకు దీపావళీ ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా యూజర్లు మనీ గెలుచుకునే అవకాశం కూడా ఉంది..గూగుల్ పే ద్వారా మనీ పంపించినప్పుడు రివార్డు కింద కొద్ది మెుత్తంలో డబ్బులు రావడం మనం చూస్తూనే ఉంటాం. అదీ కాక గిఫ్ట్ ఓచర్లు సైతం వస్తూనే ఉంటాయి. అయితే ఈ దీపావళిని మరింత సంతోషంగా మార్చేందుకు గూగుల్ పే యూజర్లకు ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ లో గేమ్ ఆడి డబ్బును పొందొచ్చని సంస్థ తెలిపింది. ఈ ఆఫర్ ద్వారా డబ్బులను ఎలా గెలుచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మీ ఫోన్ లో గూగుల్ పే యాప్ ఓపెన్ చేసి.. ముందుగా ప్రొమోషన్స్ విభాగంలో ఉన్న ఇండి-హోమ్ చాట్ ను ఓపెన్ చేయాలి. మీరు రివార్డ్స్ గెలుచుకునేందుకు దీంట్లో కొన్ని ఫ్లోర్స్ ను నిర్మించాల్సి ఉంటుంది. మీరు సింగిల్గానైనా, మీ ఫ్రెండ్ తో కలిసి అయిన దీన్ని ఆడవచ్చు. ఇందులో కొన్ని స్టెప్స్ ఉంటాయి. ప్రతీ స్టెప్ కు రివార్డ్స్ దక్కుతాయి. ఎవరికైన డబ్బు పంపించడం, క్యూఆర్ కోడ్ ను వాడి మనీ పంపడం లాంటి టాస్క్ లు సైతం ఈ స్టెప్స్ లో ఉంటాయి. దీపావళి పండగలో భాగంగా.. ఈ నెల 27వ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఇక ఈ కాంటెస్ట్ లో పాల్గొనే మెుదటి 5 లక్షల టీమ్స్ రూ. 200 వరకు మనీని క్యాష్ బ్యాక్ గా పొందవచ్చు. అయితే మీరు టీమ్ లేకుండా ఈ గేమ్ లో పాల్గొంటే.. రూ. 200 కంటే తక్కువ గెలిచే అవకాశం ఉంటుంది..
ఈ టాస్క్ లో భాగంగా మీ ఫ్రెండ్ కు డబ్బులను పంపిస్తే మీకు 30 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే విధంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పంపిస్తే.. కూడా 30 రూపాయలు రివార్డు వస్తుంది. ఇలా ఒక్కో స్టెప్ కు కొంత కొంత రివార్డ్స్ వస్తూంటాయి. ఈ క్రమంలోనే అక్టోబర్ 27వ తారిఖు లోగా టాలెస్ట్ దీపావళీ మేళాను నిర్మించండి అంటూ గూగుల్ పే సంస్థ పేర్కొంది.. కస్టమర్లు ఈ ఆఫర్ ను వినియోగించు కోవాలని గూగుల్ పే అధికారులు తెలిపారు.