జీఎస్ఎల్వీ మార్క్ 3 ప్రయోగం విజయవంతం.. వచ్చే ఏడాది చంద్రయాన్‌-3

-

జీఎస్ఎల్వీ మార్క్ 3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమ్ నాథ్ మాట్లాడారు. చంద్రయాన్ -3 ప్రయోగానికి దాదాపు అంతా సిద్ధమైందని సోమ్ నాథ్ వెల్లడించారు. వచ్చే ఏడాది జూన్ లో రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తుది ఏర్పాట్లలో భాగంగా చిన్నచిన్న పరీక్షలు చేయాల్సి ఉందని వివరించారు సోమ్ నాథ్. వచ్చే ఏడాదిలో ఫిబ్రవరితో పాటు జూన్ లో రాకెట్ ప్రయోగానికి స్లాట్లు ఖాళీగా ఉన్నాయని సోమ్ నాథ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూన్ లోనే చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు సోమ్ నాథ్. చంద్రయాన్-2 తో పోలిస్తే చంద్రయాన్-3 మిషన్ ను మరింత అత్యాధునికంగా తీర్చిదిద్దినట్లు వివరించారు. 2019లో చేపట్టిన చంద్రయాన్-2 మిషన్ చివరి క్షణంలో ఫెయిల్ అయింది.

Chandrayaan 3: ISRO to launch Chandrayaan-3 in August this year - The  Economic Times

చంద్రుడిపైన దిగే సమయంలో ల్యాండర్ తో సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. ఈ ఫెయిల్యూర్ నేర్పిన పాఠాలతో చంద్రయాన్-3 మిషన్ ను తీర్చిదిద్దినట్లు సోమ్ నాథ్ తెలిపారు. శనివారం ప్రయోగించిన జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ విజయవంతంగా 36 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టిందని వివరించారు సోమ్ నాథ్.

 

Read more RELATED
Recommended to you

Latest news