మునుగోడులో పోలింగ్ దగ్గర పడే కొద్ది రాజకీయం వేడెక్కుతోంది. దాడులు, ప్రతి దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. నిన్న కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కాన్వాయ్ లోని కారుపై బీజేపీ శ్రేణులు దాడి చేయగా, దానికి నిరసనగా రాత్రి బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ శ్రేణులు చెప్పుతో దాడి చేశాయి.
ఇక అటు ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సైతం… మునుగోడులో జోరుగా ప్రచారం చేస్తున్నారు. తన స్టైల్ లో ప్రచారం చేసుకుంటూ.. మునుగోడులో తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఇవాళ మునుగోడు ప్రజలతో డాన్స్ చేశారు. దీనిపై సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Thalupi tiyyara.. ShanthiDhutha vasthunnadu..! 😂
Mass dance & Song 🤣😂🤙🔥 #munugodu #kapaul #kapal #Munugodu #munugodubyelections pic.twitter.com/NlHB2QN1ph— Telugu Swaggers (@Telugu_Swaggers) October 25, 2022