మళ్లీ ఆమే హోంశాఖ మంత్రి.. రిషి సునాక్‌పై విమర్శలు

-

రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని అవ్వడం పట్ల ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బ్రిటన్ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ప్రధాని అయి రెండో రోజే రిషి సునాక్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం ఆయన తీసుకున్న ఓ నిర్ణయం. అదేంటంటే..?

ఆరు రోజుల క్రితమే బ్రిటన్‌ హోంశాఖ మంత్రిగా సుయిల్లా బ్రెవర్మాన్‌ రాజీనామా చేశారు. ఓ సెక్యూర్టీ ఉల్లంఘన కేసులో ఆమె లిజ్‌ ట్రస్‌ ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు. కానీ కొత్త ప్రధాని రిషి సునాక్‌ మళ్లీ బ్రెవర్మాన్‌కే హోంశాఖను అప్పగించారు. రిషి నిర్ణయంపై ప్రతిపక్ష లేబర్‌ పార్టీ ప్రధాని సునాక్‌పై విమర్శలు గుప్పిస్తోంది. రిషి సునాక్‌ ఇవాళ పూర్తి స్థాయి క్యాబినెట్‌తో భేటీ అయ్యారు. అయితే సుయిల్లా బ్రెవర్మాన్‌కు మళ్లీ హోంశాఖను అప్పగించిన అంశం వివాదాస్పదం అవుతోంది.

రెండు సార్లు డేటా ఉల్లంఘనలకు పాల్పడినట్లు కొన్ని రోజుల క్రితమే బ్రెవర్మాన్‌ అంగీకరించారు. ఆ నేపథ్యంలో ఆమె తన పదవికి రాజీనామా చేశారు. కానీ సునాక్‌ ఎందుకు ఆమెకు అంత ప్రియార్టీ ఇస్తున్నారో అర్థం కావడం లేదని 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ మాజీ చీఫ్‌ గెవిన్‌ వార్‌వెల్‌ ఆరోపించారు. బ్రెవర్మాన్‌ అపాయింట్‌మెంట్‌ సునాక్‌కు అత్యంత కష్టమైన ఛాయిస్‌ అని బార్‌వెల్‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news