మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమ బల్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఇక పూర్తి వివరాలను చూస్తే.. కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), గ్రూప్-సి నాన్ గెజిటెడ్ పోస్టులు ఉండగా 399 ఖాళీలు ఉన్నాయి. ఇక అర్హత వివరాలను చూస్తే.. పదో తరగతి/తత్సమాన పరీక్ష ప్యాసయితే అప్లై చెయ్యచ్చు. వయస్సు విషయానికి వస్తే.. 18-23 సంవత్సరాల ఉన్నవాళ్లే అర్హులు.
క్రీడా విజయాలు, రాత పరీక్ష వంటి వాటిని చూసి ఎంపిక చేస్తారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి రూ.100 కానీ ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు ఫీజు లేదు. పాల్గొన్న క్రీడలు, విభాగాలకు సంబంధించిన స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అవసరం అవుతాయి. ఈ పోస్టులకి అప్లై చేసుకునే వారికి ఎత్తు, ఛాతీ సడలింపు విషయంలో డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్/సబ్-డివిజినల్ మేజిస్ట్రేట్‌్/తాసిల్దార్ జారీచేసిన సర్టిఫికెట్ తప్పక ఉండాలి. విద్యార్హతలను తెలియజేసే సర్టిఫికెట్లు కూడా కావాలి. పూర్తి వివరాల కోసం http://www.ssbrectt.gov.in/ ని సందర్శించండి.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: ది ఇన్‌స్పెక్టర్ జనరల్, ఫ్రంటియర్ హెడ్ క్వాటర్, ఎస్‌ఎస్‌బీ పట్నా, 3వ ఫ్లోర్, కార్పురీ ఠాకుర్ సదన్, అషియానా-ఢోగ్లా రోడ్, పట్నా – 800 025, బిహార్.