ఇండియాలో ప్రధానమైన వాటిలో ఒకటైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ఆధునిక హక్కులతో పునర్నిర్మించనున్నారు. ఇందుకోసం రైల్వే శాఖ ఇటీవల గుత్తే దారును ఎంపిక చేసింది. నిర్మాణం పూర్తయ్యాక సికింద్రాబాద్ స్టేషన్ ఎలా ఉంటుంది అన్న ఆసక్తి నేపథ్యంలో రైల్వే శాఖ స్టేషన్ నూతన భవన్ డిజైన్ చిత్రాలు మూడింటిని ట్విట్టర్లో పెట్టింది.
సికింద్రాబాద్ టు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ ఫోటోలను ట్వీట్ చేశారు. వాటిలో సికింద్రాబాద్ స్టేషన్ ఆకృతులు విమానాశ్రయ తరహాలో, అంతర్జాతీయ ప్రమాణాలతో ఆకట్టుకునేలా ఉన్నాయి. భవనాలు ఆధునికంగా, పరిసరాలు ఆహ్వాదకరంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
.@NarendraModi Government – Transforming Railway Infrastructure & Railway Travel!
Telangana to get one of the most advanced state-of-the-art Railway Stations at #Secunderabad.
Here is how the revamped Secunderabad Railway Station will look like: pic.twitter.com/qUHQxT498r
— G Kishan Reddy (@kishanreddybjp) October 29, 2022