T20 World Cup : టీమిండియా-బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దు ?

-

T20 ప్రపంచ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో కీలక మ్యాచ్ కు టీమిండియా సన్నద్ధం అవుతోంది. ఆడి లైడ్ వేదికగా బుధవారం బంగ్లాదేశ్ తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై విజయం సాధించి తమ సేమీ అవకాశాలను మరింత పదిలం చేసుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. అయితే భారత్ ఆశలపై వరుణుడు నీళ్లు జల్లే అవకాశం ఉంది.

ఈ కీలక మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్లు అక్కడ వాతావరణ శాఖ తెలిపింది. కాగా గ్రూపు-2 నుంచి పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా భారత్ నేరుగా సెమీస్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్లలో తప్పక విజయం సాధించాలి. ఒకవేళ అదృష్టవశాత్తు భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు చేరో పాయింట్ లభిస్తుంది. అప్పుడు భారత్ ఐదు పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news