BREAKING : నటుడు పోసానికి సీఎం జగన్ కీలక పదవి

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు పోసాని కృష్ణమురళికి సీఎం జగన్ బంపరాఫర్ ఇచ్చారు. ఏపీ ఫిలిం డెవెలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పోసాని కృష్ణమురళిని నియమిస్తూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. గత కొన్ని ఏళ్లుగా వైసిపి పార్టీలోనే పోసాని కృష్ణ మురళి ఉంటున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున జోరుగా ప్రచారం చేశారు. అలాగే జనసేన పార్టీ పై విమర్శలు చేయడంలోనూ పోసాని కృష్ణమురళి సక్సెస్ అయ్యారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్ పోసాని కృష్ణమురళికి ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news