ఈ మధ్య కాలం లో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతూనే వుంది. ప్రతీ ఒక్కరు కూడ స్మార్ట్ ఫోన్ ని వాడుతున్నారు. అలానే పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ని కూడా వాడుతున్నారు. అయితే వాట్సాప్‌కు కొత్త ఫీచర్లు వస్తూనే ఉన్నాయి. ఇటీవల వాట్సాప్ కాల్ లింక్ ఫీచర్ ఒకటి వచ్చింది. ఇలా ఈజీగా ఉపయోగించచ్చు. మరి ఈ వాట్సాప్ కాల్ లింక్ ఫీచర్ గురించి చూద్దాం. పూర్తి వివరాలలోకి వెళితే.. కాల్ లింక్ ఫీచర్ తో ఎప్పుడైనా కాల్లో జాయిన్ కావచ్చు. ఇలా వాట్సాప్ వున్నవాళ్లు ఎవరైనా సరే కాన్ఫరెన్స్ కాల్స్ లో జాయిన్ చెయ్యచ్చు.
వాట్సాప్ కాల్ లింక్ ఫీచర్ స్టెప్స్:
దీని కోసం మొదట ఆండ్రాయిడ్ లేదా iOS మొబైల్ యూజర్లు వాట్సాప్ యాప్ ని ఓపెన్ చెయ్యండి.
నెక్స్ట్ మీరు ‘కాల్స్’ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి.
ఇప్పుడు క్రియేట్ కాల్ లింక్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
అప్పుడు వాట్సాప్ ఆటోమేటిక్‌గా కొత్త వీడియో కాల్ లింక్‌ని డిఫాల్ట్‌గా రూపొందిస్తుంది.
కాల్ టైప్ ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.
‘కాల్ టైప్’ మీద క్లిక్ చేస్తే వాయిస్, వీడియో కాల్ ని రన్ చెయ్యచ్చు.
URLలో వీడియో అని ఉంటుంది. వీడియో కాల్స్ కోసం కాల్ లింక్ వస్తుంది.
ఎదుట వ్యక్తి కి తాము వీడియో కాల్లో జాయిన్ అవుతున్నామని ముందే తెలుస్తుంది.
ఆడియో కాల్ లో కూడా ఇదే తెలుస్తుంది.
కాల్ లింక్ క్రియేట్ చేసాక స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో షేర్ చేయడానికి మూడు ఆప్షన్స్ ఉంటాయి.
సెండ్ లింక్ వయా వాట్సాప్ ని సెలెక్ట్ చేసుకుని ఎవరైనా కాంటాక్ట్ లింక్ షేర్ చెయ్యచ్చు.
అదే కాపీ లింక్ చేస్తే ఎవరికైనా లింక్ షేర్ చేసుకోవచ్చు.