కంచరపాలెం బహిరంగ సభ – వైఎస్ జగన్ ప్రసంగం హైలైట్స్‌

-


విశాఖ : వైఎస్ఆర్ హయాంలో విశాఖ నగరం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది – వైఎస్ఆర్ హయాంలో విశాఖ నగరం టాప్ గేర్ లో ప్రయాణిస్తే చంద్రబాబు హయాంలో రివర్స్ గేర్ లో ప్రయాణిస్తోంది
– రూ.1500 కోట్లతో వైఎస్ఆర్ విశాఖ నగరాన్ని అభివృద్ధి చేశారు
– విశాఖకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను తీసుకొచ్చారు
– రూ.450 కోట్లతో వైఎస్ఆర్ విశాఖకు రెండు బీఆర్టీఎస్ రోడ్లను తీసుకొచ్చారు
– కంచరపాలెం నుంచి పెందుర్తి, ఆరిలోవ నుంచి సింహాచలం రోడ్లను ఆరులైన్లుగా మార్చారు.. ఇవాళ్టికి మిగిలిపోయిన 1.3 కి.మీ. రోడ్డు విస్తీరణ పనులను ప్రభుత్వం పూర్తిచేయలేకపోతోంది
–విశాఖలో 35 వేళ ఇళ్లు వైఎస్ఆర్ హయాంలో నిర్మించారు
– విశాఖ ఉక్కు కర్మాగారం కష్టాల్లో ఉంటే వైఎస్ఆర్ కేంద్రంతో మాట్లాడి విశాఖ ఉక్కును నిలబెట్టారు.. ఇవాళ విశాఖ ఉక్కు విస్తరణపొంది రెట్టింపు కేపాసిటీతో పని చేస్తోందంటే దానికి కారణం వైఎస్ఆర్
– ఎన్టీపీసీ, హెచ్పీసీఎల్ విస్తరణ వైఎస్ఆర్ హయాంలో జరిగాయి
– జీహెచ్ పీబీని బీహెచ్ఈఎల్ లో విలీనం చేసి కొన్ని వందల కుటుంబాలను రోడ్డున పడకుండా వైఎస్ఆర్ కాపాడారు
– షిప్ యార్డ్ నష్టాల ఊబిలో ఉంటే రక్షణ శాఖలో విలీనం చేయడంలో వైఎస్ఆర్ చూపిన చొరవ గొప్పది
– అచ్చుతాపురం సెజ్, విశాఖ దువ్వాడలో ఐటీ కారిడార్, పరవాడలో ఫార్మసిటీ, బ్రాండిక్స్, సెజ్ లో పరిశ్రమలు, ఉద్యోగాలు వచ్చాయంటే వైఎస్ఆర్ చొరవే కారణం
– వర్షం వస్తే వైజాగ్ ఎయిర్ పోర్ట్ విమానాలు ఎగిరేవి కావు.. మోగాడిగడ్డ రిజర్వాయర్ కు కాలువ తీసుకొచ్చి ఎయిర్ పోర్ట్ ముంపుకు గురి కాకుండా కాపాడిన ఘనత వైఎస్ఆర్ ది – రూ.100 కోట్లతో టర్మినల్ నిర్మించి ఎయిర్ పోర్ట్ ను అంతర్జాతీయంగా తీర్చిదిద్దిన ఘనత వైఎస్ఆర్
– నాలుగునరేళ్లు కేంద్రంలో బీజేపీతో సంసారం చేసినప్పుడు చంద్రబాబుకు విశాఖ రైల్వేజోన్, ప్రత్యేక హోదా గుర్తుకురాలేదు
– మొదటి భార్య బీజేపీతో విడాకులు తీసుకన్న తర్వాత ఇప్పుడు రైల్వే జోన్, ప్రత్యేక హోదా గుర్తుకువస్తున్నాయి
– విశాఖలో జాతీయ క్రీడా ప్రాంగణం నిర్మిస్తామన్నారు
– గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు
– ఐటీ సిగ్నేచర్ టవర్స్ అన్నారు
– విశాఖకు మెట్రో రైలు తీసుకొస్తామన్నారు
– విశాఖ నగరంలో సైన్ సిటీ అన్నారు
– డిప్ వాటర్ పోర్ట్ ఏర్పాటు చేస్తామన్నారు
– భీమిలి నుంచి కాకినాడ తీరం వెంబడి రహదారి ఏర్పాటు చేస్తామన్నారు
– సబ్బవరంలో భారీ పరిశ్రమన్నారు
– విశాఖలో కూచిపూడి కళాక్షేత్రం ఏర్పాటు చేస్తామన్నారు
– విశాఖకు స్పోర్ట్ యూనివర్సిటీ అన్నారు.. ఎక్కడైనా కనిపించాయా?
– ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఇచ్చిన హామీలకు దిక్కు దివానాలేదు
– ఈ నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో విశాఖలో ఎక్కడ భూమి కనిపించినా దోచేస్తున్నారు
– పేదలకు గతంలో వైఎస్ఆర్ రాజీవ్ స్వగృహకు భూములు కేటాయిస్తే ఆ భూములను కూడా లాక్కొని తన బంధువు గీతం యూనివర్సిటీ మూర్తికి అప్పగించారు
– విశాఖలో సహా రాష్ట్రంలో ఎక్కడ విలువైన భూములు ఉన్నా గజదొంగల కేబినెట్ లో వాళ్ల బినామీలకు ఏ భూములు కేటాయించాలని చర్చిస్తారు
– లూలూ గ్రూప్ కు హోటల్ కట్టేందుకు రూ.12 వందల కోట్ల విలువైన 12 ఎకరాలను కట్టబెట్టేశారు
– ఇక్కడి భూ రికార్డులను మార్చేస్తారు
– తమది కాని ప్రభుత్వ భూమిని తమ పేరుతో పత్రాలు సృష్టించి ఆ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి ఇక్కడి మంత్రి గంటా శ్రీనివాసరావు రుణాలు కూడా తెచ్చుకుంటారు
– భోగాపురంలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి పక్కనే ఉన్న అయ్యన్నపాత్రుడు, ఎంపీ భూములు మాత్రం లాక్కొరు.. కానీ అక్కడి పేదల భూములు మాత్రం బలవంతంగా లాక్కుంటారు
– విశాఖలో భాగస్వామ్య సదస్సుల పేరుతో చంద్రబాబు మీటింగ్ లు పెడతాడు
– రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చంద్రబాబు అంటారు.. మీకేమైనా ఉద్యోగాలు కనిపించాయా? – ఈ నాలుగేళ్లలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు కూడా రాలేదని కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి
– భాగస్వామ్య సదస్సుకు ప్రభుత్వం రూ.150 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేశారు.. భోజనాలకే రూ.53 కోట్ల ఖర్చు చేశారు – వైఎస్ఆర్ హయాంలో విశాఖ ఐటీ రంగంలో 18 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి
– చంద్రబాబు నాలుగున్నర సంవత్సరకాలంలో ఆ 18 వేల ఉద్యోగాలు 16 వేలకు పడిపోయాయి
– వైఎస్ఆర్ హయాంలో ఐటీ ఎక్స్ పోర్ట్స్ రూ.2 వేల కోట్లు ఉంటే ఈ రోజు రూ.1,145 కోట్లకు పడిపోయింది
– విప్రో బిల్డింగ్ లో 5 వేల మందికి ఉద్యోగాలు రావాల్సింది.. కేవలం 250 మంది కూడా పనిచేయడం లేదు
– చంద్రబాబు పాలనలో ఐటీ రంగం దారుణంగా ఉంది– అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడంలో పీహెచ్ డీ చేసిన వ్యక్తి చంద్రబాబు
– ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు నినాదంతో 32 మంది ప్రాణాలు త్యాగం చేసి విశాఖ ఉక్కును సాధించారు
– చంద్రబాబు హయాంలో విశాఖ ఉక్కు పూర్తిగా నష్టాల్లోకి కూరుకుపోయి బీఐఎఫ్ఆర్ కు వెళ్లిపోయింది
– వైఎస్ఆర్ హయాంలో కేంద్రంతో పోరాడి విశాఖ ఉక్కును విస్తీర్ణానికి తీసుకెళ్లాడు
– చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాడు.. వరుసగా మూడేళ్లు విశాఖ ఉక్కు నష్టాల్లో ఉంది
– చంద్రబాబు అడుగు పెడితే ఏదైనా ధ్వంసం కావాల్సిందే
– విశాఖ పోర్ట్ లో 24 బెర్తులు ఉంటే ఇప్పటికే 12 బెర్త్ లు ప్రైవేట్ పరం చేశారు
– ఒకప్పుడు 24 వేలమంది కార్మికులు పనిచేసేవారు.. ఇప్పుడు 4 వేల మంది పనిచేస్తున్నారు.. చంద్రబాబు ప్రతిదాన్ని ప్రైవేటీకరణ చేస్తేస్తారు
– విశాఖ పోర్ట్ కార్గో హ్యాండిలింగ్ లో గతంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండేది.. ఈ రోజు దేశంలో ఐదో స్థానానికి దిగజారిపోయింది
– విశాఖ పోర్ట్ లో కలాసిల జీతాలు పెంచమని అడిగినా పట్టించుకునే నాథుడు లేడు – పోర్ట్ ఆధ్వర్యంలో నడిచే స్కూల్ మూతబడే పరిస్థితికి వచ్చింది – పోర్ట్ సిబ్బంది ఉండే క్వార్టర్స్ శిథిలావస్థకు చేరుకున్నాయి.. పోర్ట్ క్వార్టర్స్ కు చెందిన 20 ఎకరాలను ఎలా లాక్కొవాలని చంద్రబాబు స్కేచ్ లు వేస్తున్నారు
– వైఎస్ఆర్ హయాంలో వంద ఎకరాల విస్తీరణంలో 1,130 పడకల ఆస్పత్రి నిర్మాణానికి ఆరు బ్లాకులు, 21 సూపర్ స్పెషాలిటీ విభాగాలతో ఏర్పాటు చేయబోయే విమ్స్ కు రూ.250 కోట్లు కేటాయించారు.. చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనలో విమ్స్ ను ఆరు బ్లాక్ ల నుంచి రెండు బ్లాక్ లకు, 21 విభాగాలను 8 విభాగాలకు కుదించారు. ఉన్న వైద్యులను కూడా డిప్యూటేషన్ పద్దతిలో తీసుకొచ్చారు. విమ్స్ లో అనేక విభాగాలను ప్రైవేటీకరణ చేయడం కోసం జీవో 31 తీసుకొచ్చారు
– కేజీహెచ్ 1200 పడకలు ఉంటే 2 వేల మంది రోగులు చేరుతున్నారు.. మంచానికి ఇద్దరు రోగులను కేటాయిస్తున్నారు.. కేజీహెచ్ లో వైద్యులను, నర్సులను రిక్య్రూట్ చేయరు – కేజీహెచ్ లో కనీసం రోడ్లు కూడా సరిగా లేవు
– ప్రభుత్వాస్పత్రులను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారు
– విశాఖ నగరంలో దారుణంగా పరిపాలన సాగుతోంది
– హుద్ హుద్ తుఫాను ను జయించామని చంద్రబాబు అంటాడు.. ఆ తుఫాను కారణంగా 25 వేల ఇళ్లు దెబ్బతిన్నాయి
– ఇప్పటివరకు కేవలం 4 వేల ఇళ్లను మాత్రమే నిర్మించారు
– విశాఖలో చేసేది ప్రతీది స్కామే
– చంద్రబాబు ఫ్లాట్లు నిర్మించి పేదలకు ఇస్తే వాళ్లు 20 ఏళ్ల పాటు నెలనెలా రూ.3 వేలు కట్టాలట.. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫ్లాట్లపై ఉన్న అప్పుని మాఫీ చేస్తాం
– విశాఖ నగరంలో నాలుగేళ్లలో 75 హత్యలు జరిగాయంటే ఏ స్థాయిలో మాఫియా సామ్రాజ్యం ఉందో అర్థంచేసుకోవాలి
– ఆంధ్ర వర్సిటీలో ఇవాళ్టికి ఫ్యాకల్టీ పోస్ట్ లను భర్తీ చేయడం లేదు
– ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను, స్కూళ్లు, కాలేజీలను నిర్వీర్యం చేస్తూ గీతం వర్సిటీ, నారాయణ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తున్నారు
– పెట్రోల్, డీజిల్ పై కేంద్రం విధించే టాక్స్ లకన్నా రాష్ట్రం విధించే ట్యాక్స్ లు ఎక్కవగా ఉన్నాయి
– కాంగ్రెస్ పార్టీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని బంద్ కు పిలుపునిస్తే చంద్రబాబు బంద్ పాల్గొనాలని అంటున్నారు
– విశాఖలో రైతుల నుంచి వరి క్వింటాల్ కు రూ.1500 ఇవ్వరు.. కానీ హెరిటేజ్ లో కేజీ రూ.46కి అమ్ముతున్నారు
– కందిపప్పు క్వింటాల్ రూ3,200 కొని హెరిటేజ్ షాపులో కేజీ రూ.77 కి అమ్ముతాడు – ముఖ్యమంత్రి దళారి వ్యవస్థకు మాఫీయా డాన్ గా వ్యవహరిస్తున్నారు
– ఆరోగ్య శ్రీని ఇతర ప్రాంతాల్లో వర్తింపజేయడం లేదు – ఆరోగ్య శ్రీ వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేశారు
– మన ప్రభుత్వం అధికారంలోకి నవరత్న పథకాలను అమలు చేస్తాం – సొంత ట్యాక్సీ ఉన్న కార్మికుడికి ఏడాదికి రూ.10 వేలు ఇస్తాం
– ప్రతి పేద విద్యార్థిని ఉచితంగా డాక్టర్, ఇంజినీరింగ్ చదివించి ఏడాదికి హాస్టల్ ఫీజు కింద రూ.20 వేలు ఇస్తాం
– పిల్లల్ని బడికి పంపిస్తే ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తాం
– ఫీజు రియింబర్స్ మెంట్ వర్తింపజేస్తాం
– రాష్ట్రంలో చదువురాని వాడు లేకుండా చేస్తాం..

Read more RELATED
Recommended to you

Latest news