ఆ పంట కర్రలతో సెంద్రీయ ఎరువులను తయారు చేస్తారా?

-

కెమికల్స్ తో కూడిన వ్యవసాయం కన్నా కూడా సెంద్రీయ వ్యవసాయం పై ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. నేల స్థితిగతులను తిరిగి యథాస్థితికి తీసుకురావాలంటే ఆధునిక వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల వినియోగం ఎంతైనా అవసరం. సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలంటే వాటి లభ్యతను పెంచాలి.మనదేశంలో ఏటా 3000 మి.టన్నుల సేంద్రియ వ్యర్థాలు ఉత్పత్త వుతున్నట్లు అంచనా. దీనిలో 340 మి. టన్నుల వ్యవసాయ వ్యర్థాలు రైతుకు అందుబాటులో ఉండి, ఉచి తంగా లభించే సేంద్రియ సంపద అని చెప్పుకోవచ్చు..

మొక్కలో ఉపయోగంలేని భాగం లేదా పంటకోసిన తర్వాత మిగిలిన మోళ్ళు లేదా చెత్తా చెదారం అని అర్థం. కాని ప్రస్తుత కాలంలో సేంద్రియ వ్యవసాయానికి పెరుగుతున్న ఆదరణ చూశాక భవిష్యత్తులో పంట అవశేషాలకు పంట ఉత్పత్తుల కంటే ఎక్కువ డిమాండ్ పెరిగేలా ఉంది. భూసార పరిరక్షణకు, సుస్థిర వ్యవసాయానికి ఇవి మూలాధారం అనడంలో అతిశయోక్తి లేదు…పత్తి ఏరిన తర్వాత ఏప్రిల్ నెలలో పత్తి మొక్కలను వేరుతో సహా ట్రాక్టర్తో పీకించి ఒక దగ్గర చేర్చిన తర్వాత ట్రాక్టర్లోనే పోగుచేసిన కట్టెను తొక్కించాలి. దీని వల్ల పత్తి కట్టె ముక్కలవుతుంది. నీటి వసతి ఉన్న దగ్గర ఇటుక లతో 3 అడుగుల వెడల్పు, 3 అడుగుల ఎత్తు, 30 నుంచి 50 అడుగుల పొడవున్న తొట్టెలను కట్టుకోవాలి. తొట్టె అడుగుభాగం గట్టిగా ఉండటానికి ఇటుక ముక్కలు, కొబ్బరిపీచు, రంపపు పొట్టు లేదా మొరం మట్టి పోసి గట్టిగా చేయాలి. వానపాములకు ఎండ తగలకుండా, వానపడ కుండా తొట్టెలపై షెడ్ వేసుకోవాలి.

పత్తి కట్టె ముక్కలు, పేడను సిద్ధం చేసుకొన్న తర్వాత వీటిని తొట్టెల్లో నింపాలి. మొదట ఒకడుగు మందం వరకు పత్తికట్టె ముక్కలను నింపి వాటిపై పేడ నీటిని పోస్తూ, తడపాలి.పత్తి కట్టెను తొట్టెలో పేర్చి వేడ నీరు కలుపుతూ మళ్లీ ఒకడుగు మందం పత్తి కట్టె ముక్కలను నింపి పేడ నీటితో తడపాలి. ఈ విధంగా తొట్టె పైన ఒక అడుగు ఎత్తు వరకు పత్తి కట్టె ముక్కలను నింపాలి..నీటితో ప్రతి రెండు రోజులకు ఒకసారి తడుపుతూ ఉండాలి..దాదాపు 20-25 రోజుల్లో పత్తి కట్టె ముక్కలు కుళ్ళి పోయి వానపాములు తినటానికి అనువుగా, మెత్తగా మారతాయి. ఇప్పుడు తొట్టెలో దాదాపు 20 కిలోల వానపాములను వదలాలి. 20-25 రోజుల్లో వానపాములు కుల్లిన పత్తి కట్టెను తింటూ నాణ్యమైన వర్మికంపోస్టుగా మారుస్తాయి..ఈ ఎరువును పంటలకు వాడటం వల్ల దిగుబడి పెరుగుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news