అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. 2024లో జరిగే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారని ట్రంప్ ముగ్గరు సలహాదారులు నిర్ధారించారు. అమెరికాలో వచ్చేవారం మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ నిర్వహించిన ఒక ర్యాలీలో పాల్గొన్నారు ట్రంప్.
‘మనదేశాన్ని బలీయమైన శక్తిగా, సురక్షితంగా, విజయమంతమైన దేశంగా మార్చేందుకు నేను బహుశా మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. ఏడాది మనం మళ్లీ వైట్‌హౌస్‌లో అడుగుపెట్టబోతున్నాం. సెనేట్‌గా గెలవబోతున్నాం 2024 ఎన్నికల్లో అమెరికాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అందుకు అందరూ సిద్ధంగా ఉండండి’ అని అక్కడి జనాన్ని ఉద్దేశించి ఉత్తేజంగా ప్రసంగించారు ట్రంప్.
బరాక్ ఒబామా తర్వాత 2016లో అమెరికా అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో అడుగుపెట్టారు డొనాల్డ్ ట్రంప్. వ్యాపారవేత్త అయిన ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరఫున ఎన్నికల్లో బరిలోకి దిగి, డెమోక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ని ఓడించారు. ట్రంప్ తన పదవీకాలం తర్వాత మళ్లీ అధ్యక్షుడిగా పోటీ చేయాలనుకున్నారు. అంతేకాదు, వైట్‌హౌస్‌ను ఖాళీ చేయకపోవడం, అధికార మార్పిడికి సహకరించకపోవడం వంటి చర్యలతో వార్తల్లో నిలిచారు ట్రంప్. ప్రస్తుతం అమెరికా ప్రెసిడెంట్‌గా ఉన్న డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్తి జో బిడెన్ పదవీకాలం 2024లో ముగుస్తుంది.