సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హత్యకు కొందరు కుట్ర పన్నారంటూ వస్తున్న వార్తలు తెలుగునాట కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు సంచలన ప్రకటన చేశారు. పవన్ ఇంటి ముందు ఎలాంటి రెక్కీ జరగలేదని పోలీసులు శుక్రవారం ప్రకటించారు. పవన్ కల్యాణ్‌పై ఎలాంటి రెక్కీ కానీ, దాడికి కుట్ర గాని జరగలేదని తేల్చారు పోలీసులు. పవన్ కల్యాణ్‌పై ఎలాంటి రెక్కీ, దాడికి కుట్ర జరగలేదని తేల్చిన జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించారు. పవన్ కల్యాణ్ ఇంటి ముందు కారు ఆపింది ముగ్గురు యువకులు అని తెలిపారు పోలీసులు. కారు తీయమని అడిగిన పవన్ సెక్యూరిటీతో యువకులు గొడవకు దిగారు. అయితే.. మద్యం మత్తులో గొడవ చేసినట్లు యువకులు ఒప్పుకున్న పోలీసులు వెల్లడించారు.
యువకులను విచారించి నోటీసులు ఇచ్చామని జూబ్లీహిల్స్ పోలీసులు పేర్కొన్నారు. అయితే.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ హత్యకు కుట్ర చేశారన్న వార్తలు తెలుగు లో కలకలం రేపుతున్నాయి. పవన్ ను హత్య చేసేందుకు 250 కోట్ల సుపారీకి డీల్ ఇచ్చారని, 2019 ఎన్నికల ముందే ఇందుకు స్కెచ్ వేశారని కేంద్ర నిఘా వర్గాలు తెలిపాయంటూ ఒక న్యూస్ ఛానల్ లో వార్త వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో జనసేన నేతలు సీరియస్ గా స్పందిస్తున్నారు.