Breaking : రాహుల్‌ పాదయాత్రలో అపశృతి.. విరిగిన కానిస్టేబుల్‌ కాలు

-

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. జిల్లాలో రాహుల్ యాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలో రాహుల్ కాన్వాయ్‌ ఓ కానిస్టేబుల్ కాలుపై నుంచి వెళ్లింది. దీంతో కానిస్టేబుల్ శివకుమార్ కాలు విరిగింది. పాపన్న పేట పోలీస్ స్టేషన్‌లో శివకుమార్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వెంటనే కానిస్టేబుల్‌ను 108 వాహనంలో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే.. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అయితే ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా కేజీఎఫ్ 2 సినిమాలోని పాటలని.. రాహుల్ ప్రచారానికి ఉపయోగించారు.

Bharat Jodo Yatra In Maharashtra From Next Week, Rahul Gandhi To Address  Rallies On November 10 and 18

దీంతో సదరు పాటల హక్కుల్ని కొనుగోలు చేసిన ఎమ్ఆర్ టీ మ్యూజిక్ కంపెనీ, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాపీరైట్ ఉల్లంఘనగా దీన్ని పరిగణిస్తూ.. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్, కాంగ్రెస్ సోషల్ మీడియా హెడ్ సుప్రియా శ్రీనటేపై బెంగళూరు సిటీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తమ చట్టబద్ధమైన హక్కుల మేరకే కాంగ్రెస్ పార్టీపై కేసు పెట్టామని, ఏ రాజకీయ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే ఉద్దేశం తమ కంపెనీకి లేదని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news