మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ చాలా జోరుగా కొనసాగుతోంది. మొదట పోస్టల్ మరియు మొదటి రౌండ్ లో టిఆర్ఎస్ పార్టీ దూసుకుపోగా.. ఆ తర్వాత బిజెపి పార్టీ లీడింగ్ లోకి వచ్చింది.
ఇప్పటివరకు నాలుగు రౌండ్ లు పూర్తి కాగా… బిజెపి లీడింగ్ లో ఉంది. ఇక అటు మునుగోడు ఉప ఎన్నికల్లో హల్చల్ సృష్టించిన కే ఏ పాల్… లీడింగ్ లో మాత్రం చాలా వెనుకబడ్డారు. కేఏ పాల్ కు ఇప్పటివరకు కేవలం 34 ఓట్లు మాత్రమే వచ్చాయి. కార్డు కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపడం లేదు.