ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన టూరిజం విభాగం ఐఆర్‌సీటీసీ టూరిజం ఓ ప్యాకేజీని తీసుకు వచ్చింది. కేవలం మన దేశాలనే కాకుండా విదేశాల్లోని టూరిస్ట్ స్పాట్స్‌కి కూడా వెళ్లే ఫెసిలిటీని కూడా తీసుకు వచ్చింది. దీనితో ప్రయాణికులు హ్యాపీగా వైజాగ్ నుండి థాయ్‌ల్యాండ్ వెళ్ళచ్చు.
ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంటి టూర్ ప్యాకేజీలను థాయ్‌ల్యాండ్ చూసేందుకు ప్రవేశ పెట్టింది. ‘ఫ్యాసినేటింగ్ థాయ్‌ల్యాండ్’ పేరుతో ఈ ప్యాకేజీని తీసుకు వచ్చారు. 2022 డిసెంబర్ 8న టూర్ స్టార్ట్ అవుతుంది. ఇది 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ. ఇక టూర్ ఎలా ఉంటుంది అనేది చూస్తే.. మొదటి రోజు ఉదయం విశాఖపట్నంలో టూర్ మొదలు కాగా.. అర్థరాత్రి 1.55 గంటలకు బ్యాంకాక్ చేరుకుంటారు.
నెక్స్ట్ పట్టాయా వెళ్ళాలి. రెండో రోజు మధ్యాహ్నం నాంగ్ నూచ్ గార్డెన్ టూర్ చూడచ్చు. సాయంత్రం అల్కజార్ షో చూసేసి.. రాత్రికి పట్టాయాలో స్టే చేయాలి. మూడో రోజు పట్టాయా చూసేసి గల్ఫ్ ఆఫ్ థాయ్‌ల్యాండ్ మీదుగా కోరల్ ఐల్యాండ్ వెళ్ళాలి. రాత్రికి పట్టాయాలో ఉండాలి. అలానే నాలుగో రోజు పట్టాయా నుంచి బ్యాంకాక్… బ్యాంకాక్ చేరుకున్న తర్వాత సఫారీ వాల్డ్ టూర్ ఉంటుంది.
ఐదో రోజు బ్యాంకాక్ హాఫ్ డే టూర్ ఉంటుంది. గోల్డెన్ బుద్ధ, మార్బుల్ బుద్ధ చూసేయచ్చు. ఫైనల్ గా ఆరో రోజు మధ్యాహ్నం 2.45 గంటలకు విశాఖపట్నం రీచ్ అవుతారు. ఇక ధరల విషయానికి వస్తే.. ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ.54,999, డబుల్ ఆక్యుపెన్సీ రూ.54,999 ఉండగా సింగిల్ ఆక్యుపెన్సీ రూ.63,310 గా వుంది. పూర్తి వివరాలను IRCTC అధికారిక వెబ్ సైట్ లో చూడచ్చు.