తెలంగాణలోని పాత పది జిల్లాల వారీగా సబార్డినేట్ కోర్టుల్లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 1539
పోస్టుల వారీగా ఖాళీలు: స్టెనోగ్రాఫర్ – 54, జూనియర్ అసిస్టెంట్-277, టెపిస్టు-146, ఫీల్డ్ అసిస్టెంట్-65, ఎగ్జామినర్-57, కాపియిస్ట్-122, రికార్డ్ అసిస్టెంట్-05, ప్రాసెస్ సర్వర్-127, ఆఫీస్ సబార్టినేట్-686.
సబార్డినేట్ కోర్టులు ఉన్న పాత పది జిల్లాలు : అదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, నల్గొండ, వరంగల్, హైదరాబాద్.
అర్హత: ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్, టైప్‌రైటింగ్ (హయ్యర్‌గ్రేడ్) ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పోస్టుల ప్రకారం అర్హతలు సరిచూసుకోవాలి.
వయసు: 18- 34 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, వైవా వాయిస్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ఆగస్టు 5 నుంచి
ఫీజు: జనరల్, బీసీలకు రూ.800. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.400/-
చివరితేదీ: సెప్టెంబర్ 4
వెబ్‌సైట్: hc.ts.nic / districts.ecourts.gov.in
– కేశవ