పాపం దర్శకుడు హరీశ్ శంకర్ పరిస్థితి చాలా ఇబ్బంది కరంగా మారింది. తన చివరి సినిమా వచ్చి దాదాపు మూడేళ్లు దాటినా కూడా ఇంకో సినిమా చేతుల్లో లేదు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి హరీష్ శంకర్ చాలా రోజుల గా ఎదురు చూస్తున్నాడు.కాని ప్రస్తుతం పవన్ కల్యాణ్ పరిస్థితి కూడా సరిగా లేదు. కొన్ని రోజులు షూటింగ్ కోసం కొన్ని రోజులు రాజకీయాల కోసం సర్దుబాటు చేస్తూ వస్తున్నాడు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అక్కడి పేపర్స్ లో పవన్ కళ్యాణ్ లేకుండా వార్తలు రావడం లేదు. గత కొంతకాలంగా పవన్ తన పర్యటనల తో వైసీపీ ప్రభుత్వం పై వేడి తగిలేలా చేసాడు. దానితో దాన్ని కంటిన్యూ చేస్తూ వెళ్ళ వలసిన పరిస్థితి ఎదురు అయ్యింది.పవన్ ముందుగా చేస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా వాయిదాలు పడుతూ సకాలంలో పూర్తి కాక పోవడం జరుగుతోంది.
దీంతో హరీష్ శంకర్ క్రేజీ ప్రాజెక్ట్ ‘భవదీయుడు భగత్ సింగ్’పై ఎలాంటి అప్ డేట్ రావడంలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ వున్నట్టా లేనట్టా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ ప్యాన్స్ మాత్రం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా రాదనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం హరీశ్ శంకర్ కూడా కొన్ని కథలు తీసుకొని యంగ్ హీరోల చుట్టూ తిరుగుతూ వున్నాడట