Breaking : హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌.. నేడు, రేపు పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

-

సికింద్రాబాద్, హైదరాబాద్ సబ‌ర్బ‌న్‌కు సంబంధించి ఎంఎంటీఎస్‌ లోకల్‌ రైలు సర్వీసుల‌ను శని, ఆదివారాల్లో ర‌ద్దు చేసినట్లు రైల్వే
అధికారులు తెలిపారు. హైదరాబాద్ ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్ డేట్ చేసింది. ఇవాళ (శనివారం), రేపు (ఆదివారం)
ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఫలక్ నుమా లింగంపల్లి, లింగంపల్లి – ఫలక్ నుమా, హైదరాబాద్ – లింగంపల్లి, లింగంపల్లి – హైదరాబాద్ మార్గాల్లో నడిచే 18 రైళ్లను రద్దు చేస్తున్నట్లు వివరించింది. సికింద్రాబాద్, హైదరాబాద్ సబ‌ర్బన్‌కు సంబంధించి.. సనత్‌నగర్ – హఫీజ్‌పేట్‌ స్టేషన్ల మధ్య ట్రాక్ నిర్వహణ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రైళ్లను రద్దు చేశారు. ఇందులో ఈ నెల 12న పన్నెండు రైళ్లు, ఈ నెల 13న ఆరు రైళ్లు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణీకులు ఈ మార్పులను గమనించాలని, తమకు సహకరించాలని కోరారు. ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. అయితే.. వారాంతాల్లో ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేయడంపై ప్రయాణీకులు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. వీకెండ్స్ లో రద్దీకి అనుగుణంగా రైళ్లు నడపకుండా.. ఉన్నవాటిని తొలగించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

Hyderabad: MMTS ready to resume, awaiting green signal

మరోవైపు.. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం సికింద్రాబాద్‌ నుంచి శబరిమలకు ప్రత్యేక రైలు సర్వీసులు నడపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్ – కొల్లం స్టేషన్ల మధ్యలో ఈ నెల 20 నుంచి వచ్చే ఏడాది జనవరి 17 వరకు ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగనున్నాయి. సికింద్రాబాద్- కొట్టాయం, కొట్టాయం – సికింద్రాబాద్‌, నర్సాపుర్ – కొట్టాయం, కొట్టాయం – నర్సాపూర్ మధ్య రాకపోకలు సాగించనున్నాయి. ఈ రైళ్లు పాలకొల్లు, భీమవరం, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ , తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు , గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కొయంబత్తూర్, పాలక్కాడ్, త్రిసూర్, అల్వాయే, ఎర్నాకుళం టౌన్ స్టేషన్లలో ఆగుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news