ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రేపు హైదరాబాద్ కి వెళ్ళనున్నారు. దివంగత నటుడు కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించేందుకు బుధవారం రోజున హైదరాబాద్ వెళ్ళనున్నారు. ఇక బుధవారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వా లాంచనాలతో జరగనున్న విషయం తెలిసిందే.
నేడు సాయంత్రం తర్వాత అభిమానుల సందర్శనార్థం కృష్ణ భౌతికకాయాన్ని గచ్చిబౌలి స్టేడియానికి తరలిస్తారు. రేపు ఉదయం అక్కడి నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే సినీ ప్రముఖులు, పలు రాజకీయ నాయకులు నానక్రమ్ గూడా లోని కృష్ణ నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సీఎం కేసీఆర్, నారా చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేష్ కృష్ణ పార్టీవదేహానికి నివాళి అర్పించారు.