రష్మిక లాగా మారిన డేవిడ్ వార్నర్.. వీడియో వైరల్.!

-

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ముఖ్యంగా ఈయన క్రికెట్ విభాగంలో కంటే సోషల్ మీడియాలోనే యాక్టివ్ గా ఉంటూ పలు సెలబ్రిటీల ఫేస్ లను తన ఫేస్ తో మార్ఫింగ్ చేసి వీడియోలు పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ సెలబ్రిటీల ఫేస్ లను ఈయన ఎక్కువగా ఇమిటేట్ చేస్తూ ఉంటాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే తాజాగా మరొక వీడియోని షేర్ చేసి మరింత ఆకర్షణగా నిలిచాడు. ఇకపోతే ఇప్పటివరకు కేవలం పురుషుల వీడియోలనే మార్ఫింగ్ చేసిన వార్నర్ ఇప్పుడు హీరోయిన్ ఫేస్ ని కూడా ఇమిటేట్ చేశాడు.

ఆ వీడియోలో భాగంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఫేస్ తో మార్ఫింగ్ చేసిన వీడియోని షేర్ చేశాడు డేవిడ్ వార్నర్. రీఫేస్ యాప్ ద్వారా రూపొందించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. రష్మిక, నితిన్ జంటగా తెరకెక్కిన భీష్మ సినిమాలోని “వాటే బ్యూటీ” పాటలో రష్మిక ఫేస్ ను తన ఫేస్ తో ఎడిట్ చేసి వీడియోని షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త నెట్టింట బాగా చక్కర్లు కొడుతోంది. అంతేకాదు ఈ వీడియోని పోస్ట్ చేసిన వార్నర్” దీనికి సో సారీ “అంటూ కూడా రాసుకొచ్చారు.

అయితే ఈ వీడియో పై రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలి. అయితే అభిమానులు మాత్రం ఈ వీడియోకి లైకులతో పాటు కామెంట్లు వర్షం కూడా కురిపిస్తున్నారు. అంతేకాదు మునుపెన్నడూ లేని విధంగా ఇంత బెటర్ గా ఇప్పుడు కనిపించాడు అంటూ యువరాజ్ సింగ్ కూడా కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నవ్వుల పువ్వులు పూయిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by David Warner (@davidwarner31)

Read more RELATED
Recommended to you

Latest news