తెలుగు డైరెక్టర్ సుకుమార్,అల్లు అర్జున్ కాంబినెషన్ లో వచ్చిన సినిమా పుష్ప బాక్సాఫీస్ వద్ద ప్రభంజనాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే..ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో అల్లు అర్జున్ కు జంటగా రష్మిక మందన్న నటించారు..పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా నార్త్‌లో పుష్ప కు ఊహించని స్థాయిలో రెప్సాన్స్ వచ్చింది. ఇక ప్రస్తుతం పుష్ప సిక్వెల్ రూపొందించే పనిలో ఉన్నారు మేకర్స్. ఇటీవల ఈ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. పుష్ప విజయం తర్వాత పుష్ప 2 పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ అప్డేట్స్ ఇవ్వాలంటూ నెట్టింట గగ్గోలు పెడుతున్నారు మూవీ లవర్స్..
మొన్నీమధ్య ఓ షోలో పాల్గొన్న బన్నీ.. పుష్ప 2 అప్డేట్ అంటూ అస్సలు తగ్గేదే లే అని చెప్పడంతో ఈ మూవీ కోసం ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. అయితే, కొద్ది రోజులుగా పుష్ప 2 అప్డేట్ రాబోతుందంటూ నెట్టింట ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికీ ఈ పై ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో పుష్ప2 అప్డేట్ ఇవ్వాలంటూ రోడ్డెక్కారు బన్నీ ఫ్యాన్స్. చేతిలో బ్యానర్లు.. పోస్టర్లు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను ట్విట్టర్లో వైరల్ అవుతున్నాయి..
కర్నాటక, మహారాష్ట్ర, కేరళ, యుఎఇకి చెందిన అభిమానుల చిత్రాలు అని తెలుస్తోంది. తమ చేతుల్లో బ్యానర్లు పట్టుకుని వీధుల్లో నిలబడి పుష్ప సీక్వెల్ గురించి అప్డేట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ‘పుష్ప విజయం తర్వాత, అల్లు అర్జున్ అభిమానులు ఇప్పుడు సీక్వెల్ అప్డేట్స్ కోసం వీధుల్లో కి వచ్చేశారు. అభిమానుల్లో క్యూరియాసిటీ విపరీతంగా ఉంది. ఇలాంటివి గతంలో ఎన్నడూ చూడలేదు. అతని గొంతులో ఉత్సుకత స్పష్టంగా ఉంది’ అని ఈ ట్వీట్లో పోస్ట్ చేశారు..ఇది పోస్ట్ చేసి మూడు రోజులు అయ్యింది.ఇప్పటికీ ఇది ట్రెండ్ అవుతుంది. వీళ్ళు చేస్తున్న హంగామా వల్ల అయిన సుక్కు అప్డేట్ ఇస్తారేమో చూడాలి..సీక్వెల్ లో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి…వచ్చే ఏడాది థియెటర్లలోకి రానుంది..
After the success of #PushpaTheRise , the cult of restless #AlluArjun fans have taken to the streets asking for an update on the sequel! This rage amongst fans is absolutely fantastic, a phenomena never witnessed before! The fervour and the excitement in their voices was loud.. pic.twitter.com/Ayu1F4piBj
— Ramesh Bala (@rameshlaus) November 15, 2022