Breaking : రేసింగ్‌ కార్లతో దద్దరిల్లిన సాగర్‌ తీరం..

-

హైదరాబాద్​లో ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ ఘనంగా ప్రారంభమైంది. క్వాలిఫైయింగ్ 1, 2 తర్వాత రేస్ 1 స్పిన్ట్​ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ రేసింగ్‌లో 12 కార్లు.. 6 బృందాలు పాల్గొన్నాయి. ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ సందర్భంగా నెక్లెస్‌ రోడ్, ఎన్టీఆర్‌ మార్గ్‌లో ట్రాఫిక్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. మంత్రి కేటీఆర్ జెండా ఊపి రేసును ప్రారంభించారు.  నేడు, రేపు ఈ లీగ్ జరగనుండగా.. కొద్దిసేపటి క్రితం తొలి రోజు రేసింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. దీనిని వీక్షించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలించారు. నిర్వాహకులు కూడా అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా అభిమానులతో కలిసి రేసింగ్‌ను వీక్షించారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, హీరో నిఖిల్, కేటీఆర్ తనయుడు హిమాన్షు కూడా రేసింగ్ పోటీలను వీక్షించారు. మధ్యాహ్నం 3.10 గంటల నుంచి 3.20 గంటల వరకు తొలి క్వాలిఫైయింగ్ రౌండ్ నిర్వహించారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 3.40 గంటల వరకు రెండో క్వాలిఫైయింగ్ రౌండ్ నిర్వహించారు. క్వాలిఫైయింగ్ 1, 2 రౌండ్ల తర్వాత.. మెరుగైన టైమింగ్ సాధించిన అర్హులతో సాయంత్రం 4 గంటల నుంచి 4.45 గంటల వరకు మెయిన్ రేస్ నిర్వహించారు.

Indian Racing League: Today, tomorrow Indian Racing League.. after  afternoon break

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఫార్ములా-ఈ రేసు ప్రిపరేషన్‌లో భాగంగా ఇండియన్ రేసింగ్ లీగ్‌ను నిర్వహిస్తున్నారు. అయితే ఈరోజు పెట్రోల్ కార్లతోనే ఈ రేస్‌ను నిర్వహించారు. హైదరాబాద్‌ బ్లాక్‌ బర్డ్స్‌ సహా మొత్తం ఆరు జట్లు ఈ రేసులో తలపడ్డాయి. ఒక్కో జట్టు తరఫున ముగ్గురు పురుష, ఒక మహిళా డ్రైవర్‌ పోటీ పడ్డారు. 50 శాతం దేశీయ రేసర్లు, మరో 50 శాతం విదేశీ రేసర్లు.. ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌లో పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news