ప్రముఖ టాలీవుడ్ సినీ దర్శకుడు మదన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం ఆయనకు బ్రెయిన్
స్ట్రోక్ వచ్చింది. కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి
విషమించడంతో గత రాత్రి 1.41గంటలకు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ‘ఆ నలుగురు’ చిత్రంతో రచయితగా తన
ప్రతిభ నిరూపించుకొని.. ‘పెళ్లయిన కొత్తలో’ చిత్రంతో దర్శకుడిగా మారారు. ‘‘గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం, గాయత్రి” వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.
‘‘గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం, గాయత్రి” వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. మదన్ స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లె. సినిమాల మీద ఆసక్తితో హైదరాబాద్‌కు వచ్చి మొదట చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. టీవీ కార్యక్రమాలు రూపొందించడంతో పాటు డాక్యుమెంటరీలు కూడా తీశారు. మనసంతా నువ్వే, సంతోషం సినిమాల కోసం కెమెరామెన్ గోపాల్ రెడ్డి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు. అనంతరం కల్యాణ రాముడు, ఖుషీఖుషీగా చిత్రాలకు
రచయితగా సేవలందించారు.