Fifa World Cup : నేటి నుంచి ఫిఫా వరల్డ్‌ కప్‌.. సర్వం సిద్ధం

-

ఫుట్ బాల్ అభిమానుల కోసం సాకర్ పండుగ వచ్చేసింది. సాకర్ అభిమానులు ఎప్పిడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ కు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి డిసెంబరు 18 వరకు ఈ మెగా సాకర్ టోర్నీ ఖతార్ లో జరగనుంది. ఆదివారం జరిగే తొలి మ్యాచ్ లో ఆతిథ్య ఖతార్, ఈక్వెడార్ జట్లు తలపడనున్నాయి. ఈ ప్రపంచకప్ టోర్నీలో మొత్తం 32 జట్లు ఆడుతున్నాయి. ఒక్కో గ్రూప్ లో 4 జట్లు చొప్పున మొత్తం 8 గ్రూపులుగా విభజించారు. ఈ మ్యాచ్ లను భారత్ లో స్పోర్ట్స్ 18 చానల్లో ప్రసారం చేస్తున్నారు. కాగా, తొలి మ్యాచ్ కు ముందు భారీ స్థాయిలో ప్రారంభోత్సవం జరగనుంది.

FIFA World Cup: Which teams have qualified to Qatar 2022? Full list of all  32 nations | Sporting News

ఓపెనింగ్ సెర్మనీలో ప్రముఖ సంగీత బృందం బీటీఎస్ కు చెందిన జంగ్ కూక్ పెర్ఫార్మెన్స్ ప్రధాన ఆకర్షణ కానుంది. ఓపెనింగ్ సెర్మనీకి దోహా సమీపంలోని బేత్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. మొత్తం 32 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. గతేడాది యూరో కప్ చాంపియన్ గా నిలిచిన ఇటలీ ఈ ప్రపంచకప్ కు అర్హత సాధించలేకపోవడం గమనార్హం. ఫుట్ బాల్ ప్రపంచకప్ లో ఆడటం ఖతర్ కు ఇదే తొలిసారి.

Read more RELATED
Recommended to you

Latest news