పుష్ప 2 సినిమా హాట్ హీరోయిన్ నేహా శెట్టి ఎమ్ఎల్ఏ గా..!!

-

అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన‘పుష్ప’ సినిమా ఊహించని  వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో పాటలు , స్టైల్స్ అన్ని విపరీతంగా ఆదరణ పొందాయి. రీసెంట్ గా ఈ సినిమా ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడు పుష్ప 2కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు పుష్ప 2 స్క్రిప్ట్ కోసం సుకుమార్ చాలా టైమ్ కేటాయించి పనిచేశారు. ఈ సారి కేజీఫ్ కంటే ఎక్కువ మోతాదులో ట్విస్టులు మరియు యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టుకున్నారట.అయితే రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. వచ్చే నెలలో విడుదల  అయ్యే అవతార్ 2 సినిమా థియేటర్స్ లో విడుదల కోసం చిన్న టీజర్  ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా కోసం కోసం చాలా రకాల ట్విస్టులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా కోసం మరో  హీరోయిన్ ను  పెట్టాలని చూస్తున్నారట. ఆమె వేసేది విలన్ పాత్ర అని తెలుస్తోంది. అలాగే సినిమా లో ఆమె పొలిటికల్ రోల్ లో ఎమ్ఎల్ఏ గా చేయబోతోంది అని వార్తలు వస్తున్నాయి . ఈ పాత్ర కోసం డిజే టిల్లు లో హాట్ గా అదరగొట్టిన నేహా శెట్టి ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అవతార్ సినిమా తో థియేటర్స్ లో టీజర్ లో సందడి చేయడానికి పుష్ప రెడీ అవుతున్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news