రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాలలో పీఎం కిసాన్ యోజన స్కీమ్ ఒకటి. రైతులకు ఏడాదికీ రూ. 6000 చొప్పున అందిస్తోంది. ఈ డబ్బులు రూ.2000 చొప్పున మూడు విడతల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది.
ఈ పథకానికి అర్హులైన వారే కాకుండా అనర్హులు కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పథకంలో డబ్బులు పొందిన అనర్హుల నుంచి రికవరీ చేసే పనిలో ఉంది. మీరు అనర్హులుగా ఉండి ఈ పీఎం కిసాన్ పథకాన్ని పొందినట్లయితే జాగ్రత్తగా ఉండాలి. వారి నుంచి డబ్బులను రికవరీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలను మార్చింది. దీంతో అనర్హులు కానీ రైతులకు డబ్బులు కట్ చేయనుంది కేంద్ర ప్రభుత్వం.