పేటీఎం వాడే వారికి గుడ్ న్యూస్..!

-

మీరు పేటీఎం ని వాడుతున్నారా…? అయితే మీకు శుభవార్త. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కొత్త సర్వీసులు ని అందిస్తోంది. ఇది చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. మరి ఇక దీని కోసం పూర్తి వివరాలను చూసే… మనీ ట్రాన్స్‌ఫర్ ఇప్పుడు మరింత ఈజీ కానుంది. ఇండియన్ డిజిటల్ పేమెంట్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ప్రకారం చూస్తుంటే పేటీఎం యూజర్లు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ నుండి పే చెయ్యచ్చు.

ఇతర థర్డ్ పార్టీ యూపీఐ యాప్స్‌తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్లకు ఇక నుండి పేటీఎం యూజర్లు డబ్బులని పంపచ్చట. దీనితో ఇక నుండి పేటీఎం ఉపయోగించే వాళ్లు ఫోన్‌పే, గూగుల్‌పే వంటి వాటికి మనీ పంపించచ్చు. కనుక ఇక నుండి ఈ యూజర్లకి ఈజీ అవుతుంది. దీని గురించి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అధికార ప్రతినిధి చెప్తూ యూపీఐ వ్యవస్థలో ఇది ఒక కీలక పరిణామం అన్నారు. ఇక నుండి యూపీఐ యాప్‌కు డబ్బులని పంపవచ్చని….ఈ సేవలని పొందచ్చని చెప్పారు.

యూపీఐ యాప్స్‌కు డబ్బులు ఎలా పంపాలి..?

పేటీఏం నుండి డబ్బులని పంపించాలంటే ముందుగా పేటీఎం యాప్‌ లోకి వెళ్లాలి.
ఇక్కడ మీరు ”టు యూపీఐ యాప్స్” అనే ఆప్షన్ ని ఎంచుకోవాలి.
యూపీఐ యాప్‌కు చెందిన మొబైల్ నెంబర్ ఎంటర్ చెయ్యాలని వుంటుంది.
అది క్లికి చేసి… మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయాలి.
ఇక్కడ మీరు అమౌంట్ ని ఎంటర్ చేసేసి.. పే నౌ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
అంతే డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news